- ముఖ్యమంత్రి జగన్ దిల్లీ పర్యటన
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ దిల్లీ చేరుకున్నారు. ఈ పర్యటనలో ప్రధానితో సహా కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి జగన్ దిల్లీ లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి.
- ప్రశాంతమైన రాష్ట్రంలో మతచిచ్చు రగిలిస్తారా?: చంద్రబాబు
ప్రశాంతమైన రాష్ట్రంలో సీఎం జగన్ మతచిచ్చు రగిలిస్తూ...ఓటుబ్యాంకు రాజకీయాల కోసం రాష్ట్రాన్ని తగలబెడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్‌కు ఏ మతంపైనా విశ్వాసం లేదని మండిపడ్డారు. తమది సెక్యులర్ పార్టీ అన్న చంద్రబాబు..., ఆలయాలపై దాడులను, మత విద్వేషాలను సహించేది లేదని తేల్చి చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఏపీలో 3 రాజధానుల ఏర్పాటుపై కేంద్రం జోక్యం చేసుకోవాలి'
మూడు రాజధానుల ఏర్పాటుపై కేంద్రం జోక్యం చేసుకోవాలని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ ఏపీలో రాజధానిపై ప్రభుత్వ చర్యలను నియంత్రించాలన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తగ్గినట్టే తగ్గి.. పెరుగుతున్న మహమ్మారి
తెలంగాణలో కరోనా కేసులు నిన్న కాస్తా తగ్గుముఖం పట్టినప్పట్టికీ నేడు మళ్లీ కేసుల సంఖ్య పెరిగింది. కొత్తగా 2,166 కరోనా కేసులు, 10 మరణాలు నమోదు కాగా.. 2,143 మంది కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చంద్రుడిపైకి భారత్ మరో యాత్ర- జపాన్‌తో కలిసి...
వచ్చే ఏడాది చంద్రయాన్-3 ప్రయోగానికి సిద్ధమవుతున్న భారతీయ అంతరక్ష పరిశోధన సంస్థ( ఇస్రో) మరో జాబిలి యాత్రకు సన్నాహాలను మొదలు పెట్టింది. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ, ఇస్రో సంయుక్తంగా మూన్ మిషన్‌ను చేపట్టనున్నాయి. దీనికోసం అధ్యయన కమిటీని కూడా ఏర్పాటు చేశారు ఇస్రో అధికారులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అప్పులు భారంతో గుండె, కిడ్నీ అమ్మకానికి పెట్టిన తల్లి!
పిల్లల ఆస్పత్రుల ఖర్చుల కోసం చేసిన అప్పులు తీర్చలేక.. బతుకు భారమైన ఓ మహిళ తన అవయవాల అమ్మకానికి సిద్ధమైంది. రోడ్డు పక్కన 'ఆర్గాన్స్ ఫర్ సేల్' అని బోర్డు పెట్టి మరీ.. వచ్చీపోయేవాళ్లతో తన గోడు వెళ్లబోసుకుంది. కేరళ ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఓ మహిళ దుస్థితి తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటామని హామీ ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వీడని భయాలు.. 38 వేల దిగువకు సెన్సెక్స్
స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు కోల్పోయి 38 మార్క్ దిగువకు చేరింది. నిఫ్టీ 97 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఐటీ మినహా దాదాపు అన్ని రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జిన్‌పింగ్‌ను విమర్శించిన నేతకు 18 ఏళ్ల జైలు
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌పై విమర్శలు చేసిన అధికార పార్టీ మాజీ సభ్యుడు రెన్ ఝింగియాంగ్కు అక్కడి కోర్టు 18 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అవినీతి, లంచగొండితనం, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణల్లో ఆయనను దోషిగా తేల్చింది. కరోనాపై జిన్‌పింగ్ ప్రభుత్వం నిజాలు దాస్తోందంటూ అప్పట్లో కీలక వ్యాఖ్యలు చేశారు రెన్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆర్సీబీ వరుస ఓటములకు చెక్.. కోహ్లీ అమితానందం!
సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించిన ఉత్సాహంలో బెంగళూరు జట్టు డ్రెస్సింగ్ రూమ్‌కి తిరిగొస్తూ సంబరాలు చేసుకుంది. ఈ క్రమంలోనే అసలైన పునరాగమనం అంటే ఇదేనంటూ కోహ్లీ పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అలరిస్తోన్న 'ఒరేయ్ బుజ్జిగా'లోని కృష్ణవేణి సాంగ్
రాజ్‌తరుణ్ హీరోగా రూపొందిన చిత్రం 'ఒరేయ్ బుజ్జిగా'. విజయ్ కుమార్ కొండా దర్శకుడు. తాజాగా ఈ చిత్రంలోని 'కృష్ణవేణి' పాటను విడుదల చేసింది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.