ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5 PM - andhrapradesh top news

.

5 pm top news
5 pm ప్రధాన వార్తలు
author img

By

Published : Sep 18, 2020, 5:00 PM IST

  • కోర్టు రాజకీయ వేదిక కాదు... ఏఏజీ వ్యాఖ్యలపై హైకోర్టు
    ప్రభుత్వ భూముల వేలానికి సంబంధించి మిషన్ బిల్డ్ ఏపీపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. పూర్తిస్థాయి విచారణను అక్టోబర్ 16వ తేదీకి వాయిదా వేసింది. ప్రభుత్వం చేసే ప్రతి పనికి పిటిషనర్లు అడ్డుపడుతున్నారని అదనపు అడ్వకేట్ జనరల్ విచారణలో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై హైకోర్టు స్పందిస్తూ...కోర్టు రాజకీయ వేదిక కాదని స్పష్టం చేసింది. అక్టోబర్ 6వ తేదీలోపు ప్రభుత్వాన్ని కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • రైతులకు సూచన‌లు ఇవ్వండి
    అంబాజీపేట కొబ్బరి పరిశోధన కేంద్రం 1953 నుంచి.. కొబ్బ‌రి ఉత్పత్తిపై ప‌రిశోధ‌న‌లు చేయ‌డంపై మంత్రి కన్నబాబు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. కొబ్బరి పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన వెబినార్​లో మంత్రి పాల్గొన్నారు. మారుతున్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా రైతులకు సూచన‌లు అందించా‌ల‌ని పరిశోధన కేంద్రం వారిని కన్నబాబు కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • పెట్రోల్, హైస్పీడ్ డీజిల్‌పై సెస్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌
    పెట్రోల్, హైస్పీడ్ డీజిల్‌పై సెస్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. లీటర్‌పై రూపాయి, వ్యాట్‌కు అదనంగా 2 ఉత్పత్తులపై రూపాయి చొప్పున సెస్ విధించారు. ఈ మొత్తాన్ని డీలర్ నుంచి వసూలు చేయాలని ప్రభుత్వం ఆర్డినెన్స్‌లో పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • కోరిక తీర్చలేదో ఉద్యోగం పోతుంది..
    ఓ వైకాపా నాయకుడు తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ మహిళా వాలంటీర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోరిక తీర్చకుంటే విధుల నుంచి తొలగిస్తానని బెదిరిస్తున్నాడని వాపోయింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా పెద్ద పంజానీ మండలంలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • హోమియోపతి, వైద్య మండలి బిల్లులకు ఆమోదం
    హోమియోపతి, భారతీయ కేంద్ర వైద్య మండలి సవరణ బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ రెండు బిల్లులకు ఈనెల 15నే లోక్​సభ ఆమోదించగా.. ఏప్రిల్​లో తీసుకొచ్చిన ఆర్డినెన్స్​ల స్థానంలో అమలులోకి రానున్నాయి. వీటితో పాటు ఎంపీలు, మంత్రుల జీతాల్లో కోత విధించేందుకు తీసుకొచ్చిన బిల్లులకు మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది ఎగువసభ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • గుసగుసలు వద్దు- చీటీల ద్వారా మాట్లాడుకోండి
    పార్లమెంటు జరుగుతున్న సమయంలో ఎంపీలు ఇతర సభ్యుల వద్దకు వెళ్లి చెవిలో మాట్లాడవద్దని సూచించారు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు. చీటీల ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • పెరిగిన బంగారం, వెండి ధరలు- నేటి లెక్కలివే...
    బంగారం, వెండి ధరలు శుక్రవారం పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.224 పెరిగింది. కిలో వెండి ధర మళ్లీ రూ.70 వేలకు చేరువైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • ఫోన్ చర్చల్లో మోదీ, పుతిన్​ స్నేహగీతం
    భారత్​-రష్యా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేయాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా.. ఫోన్​లో సంభాషించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. మోదీ కూడా అదే రీతిలో స్పందించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • ఫ్రెంచ్​ ఓపెన్​కు టాప్ ప్లేయర్ దూరం
    టెన్నిస్​ స్టార్​ ప్లేయర్ నవోమి ఒసాకా, ఫ్రెంచ్​ ఒపెన్​ నుంచి తప్పుకుంది. ఎడమ కాలికి అయిన గాయం ఇంకా తగ్గకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్వీట్ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
  • ఓటీటీలోనే అనుష్క 'నిశ్శబ్దం' సినిమా
    స్వీటీ అనుష్క 'నిశ్శబ్దం' సినిమా.. అక్టోబరు 2న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.