ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5 pm

.

5 pm top news
5 pm ప్రధాన వార్తలు
author img

By

Published : Sep 17, 2020, 5:00 PM IST

  • సొంత పార్టీ ఎంపీపై స్పీకర్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు

మీడియా సమావేశంలో తనపై వైకాపా ఎంపీ సురేశ్ తనను అసభ్యపదజాలంతో దూషించారని ఆరోపిస్తూ.. ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్​సభ స్పీకర్​కు ఫిర్యాదు చేశారు. సభా హక్కుల కింద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఏపీని లాజిస్టిక్​ హబ్​గా తీర్చిదిద్దుతాం: గౌతమ్​ రెడ్డి

రాష్ట్రంలో మచిలీపట్నం, భావనపాడు, రామాయపట్నం పోర్టులు పూర్తి చేసి ఏపీని లాజిస్టిక్ హబ్​గా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ ప్రారంభించామని మంత్రి గౌతమ్​రెడ్డి స్పష్టం చేశారు. 8 ఫిషింగ్ జెట్టీలు నిర్మాణం కానున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'విస్తృత పరీక్షలతోనే కరోనా కట్టడి సాధ్యం'

కర్నూలు జిల్లాలో కరోనా కేసులను త్వరగా గుర్తించడం ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా నియంత్రిస్తున్నామని... జిల్లా నోడల్ అధికారి డాక్టర్ మోక్షేశ్వరుడు తెలిపారు. ఇప్పటికే 5 లక్షలకుపైగా కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు. గతంతో పోలిస్తే మౌలిక వసతులు బాగా మెరుగుపడ్డాయని, ప్రస్తుతం అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సహా సంజీవని బస్సుల ద్వారా పరీక్షలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారో తెలుసుకోవాలంటే క్లిక్ చేయండి.

  • అమరావతే ఆశగా... రాజధాని సాధనే శ్వాసగా రైతుల ఉద్యమం

అమరావతే ఆశగా... రాజధాని సాధనే శ్వాసగా అన్నదాతలు ఉద్యమం చేస్తున్నారు. అమరావతి ప్రాంత రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు 275వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కర్షకులు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • జీఎస్​టీ బకాయిల కోసం విపక్షాల ధర్నా

రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్​టీ బకాయిలను చెల్లించాలని కోరుతూ విపక్షాలకు చెందిన ఎంపీలు పార్లమెంటు ఎదుట ధర్నాకు దిగారు. తృణమూల్​ కాంగ్రెస్​, తెరాస, ఆర్​జేడీ సహా పలు ప్రాంతీయ పార్టీల సభ్యులు నిరసనలో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వృద్ధి రేటుపై ఆందోళనలు- మార్కెట్లకు నష్టాలు

దేశీయ, అంతర్జాతీయ ప్రతికూలతలతో స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 323 పాయింట్లు తగ్గి.. 39 వేల మార్క్​ను కోల్పోయింది. నిఫ్టీ 88 పాయింట్లు క్షీణించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • గిల్గిట్​​-బాల్టిస్థాన్​కు రాష్ట్ర హోదా ఇచ్చే పనిలో పాక్

కశ్మీర్​ అంశంలో పాక్​స్థాన్​కు ఎన్నిసార్లు భంగపాటు ఎదురైనా.. వక్రబుద్ధిని మార్చుకోవటం లేదు. తాజాగా పాక్​​ ఆక్రమిత కశ్మీర్​(పీఓకే)లోని గిల్గిట్​-బాల్టిస్థాన్​ ప్రాంతానికి పూర్థిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కరోనాతో పేదరికంలోకి మరో 15 కోట్ల మంది పిల్లలు!

కరోనా లాక్​డౌన్​ కారణంగా 15 కోట్ల మంది పిల్లలు అదనంగా పేదరికంలోకి వెళ్లినట్లు యునిసెఫ్​ వెల్లడించింది. దీంతో ప్రస్తుతం 120 కోట్ల మంది చిన్నారులు పేదరికంలో ఉన్నట్లు అంచనా వేసింది. రాబోయే కాలంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • గంగూలీ బయోపిక్​లో హృతిక్.. కానీ ఒక్క షరతు

తన బయోపిక్​లో హృతిక్ రోషన్ నటిస్తే అభ్యంతరం లేదని, కానీ ఒక్క షరతు ఉందని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చెప్పాడు. నటి నేహా ధూపియాతో జరిగిన ఇంటర్వ్యూలో పలు విషయాల్ని వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • దసరాకు బెల్లంకొండ 'అల్లుడు' సందడి

'అల్లుడు అదుర్స్' చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి దసరాకు విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్, నభా నటేష్ హీరోహీరోయిన్లు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.