- తెదేపా ఎమ్మెల్యేపై వైకాపా రాళ్ల దాడి
విశాఖ అరిలోవలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై వైకాపా వర్గీయుల రాళ్లదాడి చేశారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన కోసం 13వ వార్డు వెళ్లిన ఎమ్మెల్యే వెలగపూడిపై దాడికి దిగారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బెదిరింపుల సూత్రధారి
సీబీఐ అధికారులమంటూ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావును బెదిరించిన కేసులో సూత్రధారులుగా తమిళనటి లీనా మరియా పాల్ (మద్రాస్ కేఫ్ ఫేమ్), ఆమె భర్త సుఖేష్ చంద్రశేఖర్‌లను సీబీఐ గుర్తించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- లోకేశ్ పరామర్శ
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పరామర్శించారు. జేసీ పవన్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రోత్సాహం కరవు
చిరిగిపోయిన పవర్ లిఫ్టింగ్ సూట్ వేసుకొని పతకాలు సాధిస్తున్నాడా పారిశుద్ధ్య కార్మికుడు. జిల్లా, జాతీయ స్థాయిల్లో సత్తా చాటుతున్న తనకు కొంత ప్రోత్సాహం అందిస్తే... రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకువస్తా అని అంటున్నాడీ పేద యువకుడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పాక్‌లో భారతీయ అధికారులు అదృశ్యం
పాకిస్థాన్‌లోని భారత హైకమిషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు భారతీయ అధికారులు అదృశ్యమయ్యారు. ఈ మేరకు అధికారిక వర్గాలు వెల్లడించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇలా చేస్తే కరోనా మాయం
కొవిడ్ భూతం ఎప్పుడు ఎటు నుంచి దాడి చేస్తుందోనని అందరూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ భయాలే లేనిపోని సమస్యలు తెస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కరోనా కాలంలో కొత్తగా పుట్టుకొచ్చిన మానసిక ఒత్తిళ్లను అధిగమించేందుకు కొన్ని సూచనలు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భారీ నష్టాలు
స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల దిశగా సాగుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ భయాలతో ఆసియా మార్కెట్లలో బలహీన సంకేతాలే నష్టాలకు కారణం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మేం కోలుకున్నాం.. అమెరికా కష్టం
ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా నుంచి.. రష్యా క్రమంగా కోలుకుంటున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. అయితే అమెరికాలోని పరిస్థితుల ప్రభావం వల్ల.. ఆ దేశం ఇంకా పోరాడాల్సి వస్తోందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇట్స్ ఒకే అంటే మంచిగా ఉన్నట్లు కాదు
హీరో సుశాంత్ సింగ్ మృతిపై స్పందించిన క్రికెటర్ ఊతప్ప.. మానసిక ఒత్తిడి గురించి ఆప్తులతో మాట్లాడాలని సూచించాడు. ఎవరైనా 'ఇట్స్ ఓకే' అన్నారంటే అంతా సరిగా ఉన్నట్లు కాదని చెప్పుకొచ్చాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సల్మాన్ ఫామ్‌హౌస్‌లో బిగ్‌బాస్ షూటింగ్
హిందీ బిగ్‌బాస్ కొత్త సీజన్ ప్రోమో చిత్రీకరణకు అంతా సిద్ధం చేస్తున్నారు. అయితే దీనిని సల్మాన్ ఫామ్‌హౌస్‌లో తీయనున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.