- హైకోర్టు సీజేగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ప్రమాణ స్వీకారం
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ గోస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం జగన్‌తోపాటు పలువురు హైకోర్టు న్యాయమూర్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కరోనా పాజిటివ్
తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వ్యాక్సినేషన్‌పై నేడు కొవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ భేటీ
రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంపై సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ ఇవాళ సమావేశం కానుంది. సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు భేటీ జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తిరుపతిలో మూడవరోజు ఏపీస్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ ఘనంగా జరుగుతోంది. లైవ్ కోసం క్లిక్ చేయండి.
- చలికి తోడైన వాన- మూడు రోజులుగా వణుకుతున్న దిల్లీ
ఓ వైపు ఎముకలు కొరికే చలి, మరోవైపు ఎడతెరిపి లేని వాన.. దిల్లీ వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల ధాటికి దేశ రాజధాని స్తంభించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'నాగా'లతో చర్చల్లో కేంద్రానికి అదే పెద్ద సవాల్!
ఈశాన్యంలో 'నాగా'ల మంటలు చల్లారుతాయా..? ఈ సమస్యకు చర్చలతో పరిష్కారం లభిస్తుందా..? ఇరువర్గాల మొండివైఖరితో ఈ సమస్య కొలిక్కి వస్తుందా..? ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమే. అయితే శాంతియుతంగా దీనికి బాటలు వేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఈశాన్యంలో తిరుగుబాటుదారులకు చైనా మద్దతు ఇచ్చేందుకు కుట్రలు పన్నుతోంది. ఇది భారత్‌కు మరిన్ని సవాళ్లు తెస్తుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'చమురు' జోరు- లాభాల్లో మార్కెట్లు
స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. టీకా పంపిణీ వార్తలతో పాటు, అంతర్జాతీయ మిశ్రమ పవనాలతో సెన్సెక్స్ 108 పాయింట్లు లాభపడి 48,545 కి చేరింది. జాతీయ స్టాక్ ఎక్సేంజీ- నిఫ్టీ 29పాయింట్లు పెరిగి 14,228 వద్ద ట్రేడవుతోంది. లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి.
- అమెరికా సెనేట్ ఎన్నికలపై ట్రంప్ ప్రభావం!
అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ.. రిపబ్లికన్ ఓటర్లపై అధ్యక్షుడు ట్రంప్ ప్రభావం తగ్గినట్టు కనిపించడం లేదు. అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న ట్రంప్ ఆరోపణలను మూడొంతుల మంది రిపబ్లికన్ ఓటర్లు విశ్వసిస్తున్నట్టు.. జార్జీయా సెనేట్ ఎన్నికల వేళ నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం తేలింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్.. ర్యాంకింగ్స్‌లో కివీస్‌దే అగ్రస్థానం
రెండో టెస్టులోనూ గెలిచిన కివీస్.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ ఘనత సాధించడం ఆ జట్టుకిదే తొలిసారి కావడం విశేషం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కరోనా ఎఫెక్ట్.. గ్రామీ పురస్కారాల వేడుక వాయిదా
కరోనా కారణంగా 63వ గ్రామీ అవార్డుల ఫంక్షన్ వాయిదా పడింది. వైరస్ వ్యాప్తిస్తున్న క్రమంలో సినీ, టెలివిజన్ కార్యక్రమాలపై లాస్ ఏంజెల్స్‌లో ఆంక్షలు విధించడం వల్ల.. ఈ వేడుకను మార్చి 14న ఏర్పాటు చేయనున్నామని నిర్వాహకులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.