ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11 AM - తెలుగు తాజా వార్తలు

.

11 am top news
ప్రధాన వార్తలు
author img

By

Published : Dec 23, 2020, 10:59 AM IST

  • దేశంలో పెరిగిన కరోనా కేసులు... కొత్తగా మరో 23,950

దేశంలో తాజాగా 23,950 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,00,99,066కు చేరింది. 24 గంటల్లో 333మంది వైరస్​ కారణంగా మృతిచెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అమరావతిలో మరో రైతు హఠాన్మరణం.. గుండెపోటుతో మృతి

రాజధాని అమరావతి కోసం భూమిని అందజేసిన మరో రైతు గుండె ఆగింది. తాళ్లాయపాలేనికి చెందిన పెద్ద పకీరయ్య గుండెపోటుతో మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తెలంగాణ సోనాతో.. మధుమేహం నియంత్రణ

బాస్మతి, సోనా మసూరి, బ్రౌన్‌ బియ్యం, తృణధాన్యాలతో పోలిస్తే తెలంగాణ సోనా బియ్యం రుచి, ఆరోగ్యకరం అనే విషయం చాలామందికి తెలియదు. ఈ అన్నం తిన్నాక రక్తంలో గ్లూకోజ్‌ శాతం అంతకుముందు ఉన్నదానికన్నా 10 శాతం వరకూ తగ్గిందని పలువురు వినియోగదారులు చెప్పారు. టైప్‌-2 రకం మధుమేహాన్ని నియంత్రించడానికి ఈ బియ్యం ఉపయోగపడుతున్నాయని వెల్లడైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మాచ్​ఖండ్​కు మహర్దశ... జనరేటర్ల ఆధునీకరణకు సన్నాహాలు

ఆంధ్రా- ఒడిశా రాష్ట్రాలకు విద్యుత్ వెలుగులు అందిస్తోన్న మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్తు కేంద్రానికి మంచి రోజులు రానున్నాయి. గత 65 ఏళ్లుగా నిర్విరామంగా విద్యుత్తు ఉత్పాదన జరుపుతూ పదే పదే మరమ్మతులకు గురవుతున్న జనరేటర్ల ఆధునీకరణకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు.. రెండు రాష్ట్రాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 9 నెలల తర్వాత పూరీ జగన్నాథుడి దర్శనం

ఒడిశా పూరీలోని జగన్నాథస్వామి ఆలయం ఎట్టకేలకు తెరుచుకుంది. తొమ్మిది నెలల విరామం తరువాత గుడిని తెరిచారు అధికారులు. కరోనా నెగిటివ్ రిపోర్టు ఉన్నవారికే దర్శనానికి అనుమతిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'మా విడాకులకు భాజపానే కారణం!'

ముమ్మారు తలాక్ రద్దు చేసిన పార్టీ(భాజపా)నే విడాకులు ఇవ్వాలని తన భర్తను ప్రోత్సహిస్తోందని టీఎంసీ నేత సుజాతా మండల్ ఆరోపించారు. భాజపా ఎంపీ సౌమిత్ర ఖాన్​ భార్య అయిన సుజాత.. ఇటీవలే టీఎంసీలో చేరారు. పార్టీ మారినందుకే తనకు సౌమిత్ర విడాకులు ఇస్తున్నారని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 46,150పైకి సెన్సెక్స్- ఐటీ, ఆటో షేర్ల జోరు

స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 150 పాయింట్లకుపైగా లాభంతో 46,157 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50 పాయింట్లకుపైగా పెరిగి 13,519 వద్ద కొనసాగుతోంది. లైవ్ అప్​డేట్స్ కోసం క్లిక్ చేయండి.

  • '120 ఏళ్ల కనిష్ఠానికి అమెరికా జనాభా వృద్ధి'

అగ్రరాజ్యంలో జనాభా వృద్ధి గణనీయంగా తగ్గింది. 2019-20లో జనాభా పెరుగుదల 120 ఏళ్లలో అతి తక్కువగా నమోదైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఇంగ్లాండ్​తో తొలి టెస్టుకూ షమీ అనుమానమే!

ఫిబ్రవరిలో ఇంగ్లాండ్​తో జరగనున్న తొలి టెస్టులోనూ.. టీమ్​ఇండియా పేసర్​ మహ్మద్​ షమీ ఆడడంపై అనుమానం వ్యక్తమవుతోంది. అతడు గాయం నుంచి కోలుకోవడానికి ఆరు వారాల సమయం పడుతుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వైరల్​: కిరాక్​​.. బాలయ్య నయా లుక్​

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్​లో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్ర షూటింగ్​లోని బాలయ్య లుక్​ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారాయి. ఇందులో బాలయ్య వైట్​ అండ్​ వైట్​ డ్రస్​లో కోర మీసంతో ఉన్న లుక్​ అభిమానులను ఆకట్టుకుంటోంది. పూర్తి వివరాల క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.