ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1 PM

ప్రధాన వార్తలు @ 1 PM

top news
ప్రధాన వార్తలు
author img

By

Published : Jan 20, 2021, 12:58 PM IST

  • పోరాటం @ 400వ రోజు.. అమరావతి కోసం పోరు ఆగదన్న రైతులు

అలుపెరగని అమరావతి అన్నదాతల పోరాటం 400వ రోజుకు చేరుకుంది. రాజధాని గ్రామాల్లో రైతులు ర్యాలీ నిర్వహించారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించేత వరకు తమ ఉద్యం ఆగదని రైతులు ముక్తకంఠంతో తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • దేవినేనిని అడ్డుకున్న పోలీసులు.. ఇంటి ఆవరణలోనే దీక్ష

అమరావతి ఉద్యమం 400వ రోజుకు చేరుకున్న సందర్భంగా... నిరసన దీక్షకు వెళ్తున్న దేవినేని ఉమను పోలీసులు అడ్డుకున్నారు. ఉమా దీక్షకు ధూళిపాళ్ల నరేంద్ర మద్దతు తెలిపారు. పోలీసులతో దేవినేని ఉమ, దూళిపాళ్ల నరేంద్ర వాగ్వాదానికి దిగారు. తన ఇంటి ఆవరణలోనే దేవినేని ఉమ దీక్షకు కూర్చున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కృష్ణాయపాలెం రైతులపై... అట్రాసిటీ సెక్షన్లు కొట్టివేసిన హైకోర్టు

కృష్ణాయపాలెం రైతులపై పోలీసులు పెట్టిన కేసుల్లో... అట్రాసిటీ సెక్షన్లను హైకోర్టు కొట్టివేసింది. ఎస్సీ రైతులు అట్రాసిటీ సెక్షన్లు ఎత్తివేయాలని క్వాష్ పిటిషన్ వేసిన మేరకు.. ఉన్నత న్యాయస్థానం విచారణ చేసి.. ఈ మేరకు నిర్ణయం వెలువరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'దిల్లీ పర్యటన.. వ్యక్తిగత లాభం కోసమా ? రాష్ట్ర ప్రయోజనాల కోసమా?'

ముఖ్యమంత్రి దిల్లీ పర్యటనపై గోప్యత ఎందుకని తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రిని కలిసి పోలవరం నిధుల గురించి అడిగామని చెప్పడం... అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'గురు గోవింద్​ సింగ్​ జీవితం.. మానవాళికి స్ఫూర్తిదాయకం'

10వ సిక్కుమత గురువు గురు గోవింద్​ సింగ్​ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి ఆయనను స్మరించుకున్నారు. ఆయన జీవితం మానవాళికి స్ఫూర్తిదాయకమని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో హిజ్రా విజయం

మహారాష్ట్రలోని భడ్లి బుద్రుక్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓ హిజ్రా గెలుపొందారు. ఈ విజయంతో రాష్ట్రంలో పంచాయతీ సభ్యులుగా ఎన్నికైన తొలి హిజ్రాగా ఘనత పొందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 3 నెలల తర్వాత అజ్ఞాతం వీడిన జాక్ మా

చైనా బిలియనీర్​ జాక్​ మా దాదాపు మూడు నెలల తర్వాత అజ్ఞాతం వీడారు. ఆ దేశ విధానాలను ఎండగట్టి.. కమ్యూనిస్టు ప్రభుత్వ ఆగ్రహానికి గురైన జాక్​ మా.. కొన్నాళ్లుగా బహిరంగంగా కనిపించలేదు. దీంతో అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. తాజాగా ఆయన కనిపించడం అనుమానాలకు తెరదించినట్లైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఈ-కామర్స్‌లో ఎఫ్‌డీఐ నిబంధనల సవరణ!

ఈ కామర్స్ రంగ విదేశీ పెట్టుబడుల (ఎఫ్​డీఐ) నిబంధనల్లో సవరణ అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని సమాచారం. సంప్రదాయ వ్యాపారుల నుంచి ఆందోళ వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం ఆ దిశగా అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కరోనా సెగ.. హోటల్​ గదిలోనే స్టార్​ టెన్నిస్​ ప్లేయర్​ ప్రాక్టీస్​

ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో ఇప్పటికీ పది కరోనా పాజిటివ్​ కేసులు నమోదవ్వడం వల్ల 72 మంది ఆటగాళ్లు కఠిన క్వారంటైన్​లోకి వెళ్లిపోయారు. వీరందరూ తమ గదులను దాటి బయటకు వచ్చి ప్రాక్టీస్​ చేయడానికి అనుమతి లేదు. దీంతో గదులకే పరిమితమైన వీరు భిన్నమైన రీతిలో తమ ప్రాక్టీసు కొనసాగిస్తున్నారు. వీడియో కోసం క్లిక్ చేయండి.

  • అభిమానుల హంగామాకు రౌడీ హీరో భావోద్వేగం

ఒకానొక సమయంలో తన నటనను ప్రేక్షకులు గుర్తిస్తారా? అని బాధపడేవాడ్ని అంటున్నారు హీరో విజయ్​ దేవరకొండ. కానీ, ప్రస్తుతం 'లైగర్​' చిత్ర ఫస్ట్​లుక్​కు ప్రేక్షకుల నుంచి వస్తోన్న ఆదరణ చూస్తే ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.