ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1 pm - ఆంధ్రప్రదేశ్ వార్తలు

.

1 pm top news
ప్రధాన వార్తలు @ 1pm
author img

By

Published : Sep 10, 2020, 1:05 PM IST

  • అంతర్వేది ఘటనకు వ్యతిరేకంగా దిల్లీలో భాజపా నిరసన

అంతర్వేది ఘటనపై సీఎం న్యాయవిచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ దిల్లీలో భాజపా, జనసేన నేతలు నిరసన చేపట్టారు. దుండగులను శిక్షించాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'సరైన నిఘా లేనందునే మోసాలు జరుగుతున్నాయి'

అప్పన్నబంగారం అమ్ముతామంటూ జరిగిన మోసంలో ఇంటి దొంగల పాత్ర పట్టు బడింది. దేవాలయ సిబ్బంది ఇందులో కీలక పాత్ర ,ప్రధాన నిందితులుగా పోలీసులు గుర్తించి, అరెస్ట్ చేయడం ఇందులో కీలక పరిణామం. ఈ వ్యవహారంలో దాదాపు రూ.38 లక్షల వరకు చేతులు మారినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. పొరుగు సేవల సిబ్బందిపై సరైన నిఘా కొరవడినందునే మోసాలు జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆదాయానికి కరోనా గండి

కరోనా ప్రభావంతో విశాఖ జిల్లాలో పలు పౌర సేవలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రధానంగా ప్రభుత్వానికి అదాయం తెచ్చే శాఖలైన రిజిస్ట్రేషన్, రవాణా శాఖలపైనా పౌర సేవా విభాగాలపైనా ప్రభావం చూపుతోంది. విశాఖ జిల్లా కలెక్టరేట్ లో దాదాపు 5 నుంచి ఆరు శాతం మంది సిబ్బంది కొవిడ్ బారిన పడి హోం ఐసొలేషన్ లో ఉన్నారు. ఇక రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కొవిడ్ తాకిడి ఎక్కువగా ఉంది. ఇక్కడ ప్రతి నిత్యం రిజిస్ట్రేషన్ కోసం వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చే వారి నుంచి వేలి ముద్రలు సేకరించడం, పలు చోట్ల సంతకాలు చేయాల్సి రావడం వంటి వాటి వల్ల కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. దీనికి తోడు కార్యాలయాల్లోకి వచ్చి పోయే వారిని తనిఖీ చేసే వ్యవస్ధలు అంత పటిష్టంగా లేకపోవడం కూడా వ్యాప్తికి ఒక కారణంగా నిలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • త్వరలో 30 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు

రాష్ట్రంలో పర్యటక రంగానికి సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రాబోతుందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే భారత పర్యాటక అభివృద్ధి సంస్థతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. దిల్లీలోని ఐటీడీసీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కమలవర్ధనరావుతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వాయుసేన 17వ స్క్వాడ్రన్​లో చేరిన రఫేల్​

నాలుగేళ్ల నిరీక్షణ ఫలించింది. భారత వాయుసేన అమ్ములపొదిలోకి భీకర రఫేల్ యుద్ధవిమానాలు అధికారికంగా చేరాయి. భారత్​, ఫ్రాన్స్​ రక్షణ మంత్రుల సమక్షంలో 17వ స్క్వాడ్రన్​ 'గోల్డెన్​ యారోస్​'కు రఫేల్​ను రక్షణ శాఖ అప్పగించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'సరిహద్దు సమీప ప్రజలను ఎక్కడికీ పంపించట్లేదు!'

చైనా సరిహద్దులోని వాస్తవాధీన రేఖకు సమీపంలో ఉన్న గ్రామాలను ఖాళీ చేయిస్తున్నట్లు వస్తున్న వార్తలను ఖండించింది సైన్యం. తప్పుడు వార్తలను వ్యాప్తి చేయటం సరైనది కాదని పేర్కొంది. పుకార్లను నమ్మొద్దని అరుణాచల్​ప్రదేశ్​, అసోం ప్రజలను కోరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భారీ లాభాల్లో మార్కెట్లు- సెన్సెక్స్ 440 పాయింట్లు ప్లస్

అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పవనాలతో దేశీయ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 448 పాయింట్లు పైకెగిసి 38,642 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 117 పాయింట్లు మెరుగుపడి 11,395 పాయింట్లకు చేరుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మామను ఎలా చంపారో ట్రంప్​కు​ చెప్పిన కిమ్!

ఉత్తర కొరియా అధినేత కిమ్​ జోంగ్​ ఉన్​.. తన అంకుల్​ను ఎలా చంపారో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు చెప్పినట్లు సంచలన విషయం బయటకు వచ్చింది. ప్రముఖ పాత్రికేయుడు బాబ్​ ఉడ్​వర్డ్​ పుస్తకం 'రేజ్'లో ఈ విషయాలు ట్రంప్ తనకు చెప్పినట్లు వివరించారు. కరోనా వైరస్​ ముప్పు గురించి కూడా ట్రంప్​కు ముందే తెలుసనని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఈడెన్ గార్డెన్స్​లో అభిమానుల ఎనర్జీ ఈసారి మిస్

కరోనా కారణంగా ఈసారి ఈడెన్ గార్డెన్స్​లో అభిమానుల అరుపులు, కేకలను మిస్ అవుతామని చెప్పాడు కోల్​కతా జట్టు కెప్టెన్ దినేశ్ కార్తిక్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • క్వారంటైన్​ నుంచి కంగనా రనౌత్​కు మినహాయింపు

స్వస్థలం హిమాచల్​ ప్రదేశ్​ నుంచి ముంబయి చేరుకున్న కంగన, ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవడం వల్ల క్వారంటైన్​ నుంచి అధికారులు మినహాయింపునిచ్చారు. ప్రస్తుతం ఈమెకు, మహారాష్ట్ర సర్కారు మధ్య వివాదం నడుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.