ETV Bharat / city

'కుంభకోణంలో దండుకున్న డబ్బుతో జల్సాలు' - devikarani

తెలంగాణలో ఈఎస్​ఐ మందుల కుంభకోణంలో రోజుకో కొత్త వ్యవహారం బయటపడుతోంది. అధికారులు, సిబ్బంది, ఫార్మా సంస్థల నిర్వాహకులు కుమ్మక్కై డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్టు తాజాగా అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. మొత్తంగా అందరూ కలిసి రూ.13 కోట్లకు పైగా స్వాహా చేసినట్లు తాజాగా బయటపడింది. అక్రమ సంపాదనతో దేవికారాణి జల్సాలు చేసినట్టు ఏసీబీ గుర్తించింది. ఇందుకు సంబంధించి వీడియోలు బయటపడడం కలకలం రేపుతోంది.

esi-medical-scam-update-news
author img

By

Published : Nov 2, 2019, 9:01 AM IST

కుంభకోణంలో దండుకున్న డబ్బుతో జల్సాలు

తెలంగాణ ఈఎస్​ఐ డైరెక్టర్​ దేవికారాణి బాగోతాలపై ఏసీబీ లోతైన దర్యాప్తు జరుపుతోంది. కుంభకోణంలో దండుకున్న డబ్బుతో ఆమె జల్సాలు చేసినట్టు బయటపడడం చూసి అనిశా అధికారులు ఆశ్చర్యపోతున్నారు. మూడు కోట్ల రూపాయలకు పైగా బంగారం కొనుగోలు చేసినట్లు తేలింది. మరో వైపు భారీగానే ఆస్తులు సమకూర్చుకున్నట్లు గుర్తించారు. జల్సాలు చేసినట్లు కూడా అధికారులు ఆధారాలు సేకరించారు. ఆమె నృత్యాలు చేస్తోన్న వీడియోలు బయటపడ్డాయి. అధికారులు, సిబ్బంది కలిసి ఫార్మా సంస్థల నిర్వాహకులతో కలిసి డబ్బులు దండుకునే లక్ష్యంతో దేవికారాణి డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్లు అనిశా విచారణలో వెలుగు చూసింది.

డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి దండుకున్నారు...

ఏకంగా 13 కోట్ల రూపాయలు వీరంతా కలిసి స్వాహా చేసినట్లు బయటపడింది. దేవికారాణి, నాగలక్ష్మి కలిసి మధురిమ మెడికల్స్‌, సర్జికల్స్‌... సాయిరాం డిస్ట్రిబ్యూటర్స్‌ పేరిట రెండు డొల్ల కంపెనీలు ఏర్పాటు చేశారు. వీటిని తేజ ఫార్మా ఎండీ రాజేశ్వర్‌రెడ్డి సోదరుడు శ్రీనివాస్‌రెడ్డి నిర్వహించేవాడని ఏసీబీ అధికారుల దర్యాప్తులో బయటపడింది. 2016, 18 సంవత్సరాల్లో శ్రీనివాస్‌రెడ్డి 5కోట్ల 98 లక్షల రూపాయల విలువైన కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నారు. పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకంగా ఈ తతంగం నడిచింది. కంపెనీకి ఎటువంటి అర్హత లేకపోయినప్పటికీ దేవికారాణి సంస్థతో ఒప్పందం చేసుకుంది. వాస్తవానికి ఔషధాల విలువ 1.79 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ ఒప్పందం ప్రకారం రూ.5.98 కోట్లు చెల్లించారు. దీని వల్ల ప్రభుత్వానికి 4.09 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. మరో రెండు డొల్ల కంపెనీల ద్వారా ఇదే తరహాలో 9 కోట్ల రూపాయలకు పైగానే దండుకున్నట్లు ఏసీబీ తేల్చింది.

17కు చేరిన అరెస్టుల సంఖ్య

మందుల కొనుగోలు కుంభకోణం కేసులో అనిశా అధికారులు డొల్ల కంపెనీల నిర్వాహకుడు శ్రీనివాస్‌రెడ్డిని అరెస్టు చేయటంతో... కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య 17 కు చేరింది. కొల్లగొట్టిన సొమ్ములో ఎవరెవరు ఎంత మొత్తం తీసుకున్నారు, ఇతర అధికారుల పాత్ర ఏమిటి, అనే అంశాలపై ఏసీబీ లోతైన దర్యాప్తు చేస్తోంది. మరో వైపు దేవికారాణి దండుకున్న డబ్బుతో భారీగానే బంగారం కొనుగోలు చేయటంతో పాటు డబ్బును నగల దుకాణాలకు మళ్లించినట్టు ఏసీబీ దర్యాప్తులో గుర్తించింది. ఏయే దుకాణాల్లో ఆమె నగలు కొనుగోలు చేశారు, ఎక్కడెక్కడ ఆస్తులు సమకూర్చుకున్నారు అనే అంశాలపైన అనిశా దృష్టి సారించింది.

మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం

దేవికారాణి ఇతర అధికారులతో కలిసి ఇంకా ఎన్ని డొల్ల కంపెనీలు ఏర్పాటు చేశారు, ఎంత మేరకు దండుకున్నారు, అనే విషయాలపై ఏసీబీ లోతుగా విచారిస్తోంది. ఈ నేపథ్యంలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది.

ఇవీ చూడండి:

ఈఎస్​ఐ కుంభకోణం కేసులో మరొకరి అరెస్టు

TG_HYD_01_02_ACB_MEDICAL_SCAM_UPDATE_PKG_3066407 REPORTER:K.SRINIVAS NOTE:డెస్క్‌, టిజి టిక్కర్‌ వాట్సప్‌, ద్వారా పంపుతున్న ఫోటోతో పాటు ఫైల్‌ విజువల్స్‌ వాడుకోగలరు. ( )బీమా వైద్య సేవల సంస్థ (ఐఎంఎస్‌) మందుల కొనుగోలు కుంభకోణంలో రోజుకో కొత్త వ్యవహారం బయటపడుతోంది. అధికారులు, సిబ్బంది, ఫార్మా సంస్థల నిర్వాహకులు కుమ్మక్కై డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్టు తాజాగా అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. రెండు కంపెనీల ద్వారా నాలుగు కోట్ల రూపాయలు, మరో రెండు కంపెనీల ద్వారా 9 కోట్లకు పైగా దండుకున్నట్టు బయటపడింది. మొత్తంగా అందరూ కలిసి 13 కోట్లకు పైగా స్వాహా చేసినట్టు తాజాగా బయటపడింది. అక్రమ సంపాదనతో దేవికారాణి జల్సాలు చేసినట్టు ఏసీబీ గుర్తించింది. ఇందుకు సంబంధించి వీడియోలు బయటపడడం కలకలం రేపుతోంది.....LOOOK V.O:దేవికారాణి బాగోతాలపై ఏసీబీ లోతైన దర్యాప్తు జరుపుతోంది. కుంభకోణంలో దండుకున్న డబ్బుతో ఆమె జల్సాలు చేసినట్టు బయటపడడంతో అనిశా అధికారులు ఆశ్చర్యపోతున్నారు. మూడు కోట్ల రూపాయలకు పైగా బంగారం కొనుగోలు చేసినట్టు తేలింది. మరో వైపు భారీగానే ఆస్తులు సమకూర్చుకున్నట్టు గుర్తించారు. జల్సాలు చేసినట్టు కూడా అధికారులు ఆధారాలు సేకరించారు. ఆమె నృత్యాలు చేస్తున్న వీడియోలు బయటపడ్డాయి. అధికారులు, సిబ్బంది కలిసి ఫార్మా సంస్థల నిర్వాహకులతో కలిసి డబ్బులు దండుకునే లక్ష్యంతో దేవికారాణి డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్టు ఏసీబీ విచారణలో వెలుగు చూసింది. ఏకంగా 13 కోట్ల రూపాయలు వీరంతా కలిసి స్వాహా చేసినట్టు బయటపడింది. దేవికారాణి, నాగలక్ష్మి కలిసి మధురిమ మెడికల్స్‌, సర్జికల్స్‌... సాయిరాం డిస్ట్రిబ్యూటర్స్‌ పేరిట రెండు డొల్ల కంపెనీలు ఏర్పాటు చేశారు. వీటిని తేజ ఫార్మీ ఎండి రాజేశ్వర్‌రెడ్డి సోదరుడు శ్రీనివాస్‌రెడ్డి నిర్వహించేవాడని ఏసీబీ అధికారుల దర్యాప్తులో బయటపడింది. 2016,18 సంవత్సరాల్లో శ్రీనివాస్‌రెడ్డి 5.98 కోట్ల రూపాయల విలువైన కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నారు. పూర్తిగా నిబంధనలు వ్యతిరేకంగా ఈ తతంగం నడిచింది. కంపెనీకి ఎటువంటి అర్హత లేకపోయినప్పటికీ దేవికారాణి సంస్థతో ఒప్పందం చేసుకుంది. వాస్తవానికి ఔషధాల విలువ 1.79 కోట్ల రూపాయలు మాత్రమే. కాని ఒప్పందం ప్రకారం 5.98 కోట్లు చెల్లించారు. దీని వలన ప్రభుత్వానికి 4.09 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. మరో రెండు డొల్ల కంపెనీల ద్వారా ఇదే తరహాలో 9 కోట్ల రూపాయలకు పైగానే దండుకున్నట్టు ఏసీబీ తేల్చింది. V.O:మందుల కొనుగోలు కుంభకోణం కేసులో అనిశా అధికారులు డొల్ల కంపెనీల నిర్వాహకుడు శ్రీనివాస్‌రెడ్డిని అరెస్టు చేయడంతో... కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య 17 కు చేరింది. కొల్లగొట్టిన సొమ్ములో ఎవరెవరు ఎంత మొత్తం తీసుకున్నారు, ఇతర అధికారుల పాత్ర ఏమిటి, అనే అంశాలపై ఏసీబీ లోతైన దర్యాప్తు చేస్తోంది. మరో వైపు దేవికారాణి దండుకున్న డబ్బుతో భారీగానే బంగారం కొనుగోలు చేయడంతో పాటు డబ్బును నగలు దుకాణాలకు మళ్లించినట్టు ఏసీబీ దర్యాప్తులో గుర్తించింది. ఏయే దుకాణాల్లో ఆమె నగలు కొనుగోలు చేశారు, ఎక్కడెక్కడ ఆస్తులు సమకూర్చుకున్నారు అనే అంశాలపైన అనిశా దృష్టి సారించింది. E.V.O:దేవికారాణి ఇతర అధికారులతో కలిసి ఇంకా ఎన్ని డొల్ల కంపెనీలు ఏర్పాటు చేశారు, ఎంత మేరకు దండుకున్నారు, అనే విషయాలపై ఏసీబీ లోతుగా విచారిస్తోంది. ఈ నేపథ్యంలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.