ETV Bharat / city

ఆలయాల వద్ద స్టాళ్లలో ధరల నియంత్రణపై.. దేవాదాయ శాఖ సర్క్యులర్ - ఏపీ తాజా వార్తలు

Circular to temple EOS: ఆలయాల సమీపంలోని స్టాళ్లలో ధరల నియంత్రణపై దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్‌లాల్ ఉత్తర్వులు జారీచేశారు. ఎమ్మార్పీ ధరలకే విక్రయాలు జరిగేలా చూడాలని ఈవోలకు ఆదేశించారు. కొబ్బరికాయలు, పూలు, తినుబండారాల ధరలు ఈవో నిర్దేశించాలన్నారు. ప్రైవేటు స్థలాల్లో స్టాళ్లల్లోనూ ధరల నియంత్రణపై దృష్టి సారించాలని... పూర్తిస్థాయి పర్యవేక్షణకు విజిలెన్స్ విభాగం ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు.

Circular to temple EOS
దేవాదాయ శాఖ సర్క్యూలర్​
author img

By

Published : Apr 1, 2022, 3:31 PM IST

Circular to temple EOS: దేవస్థానాల సమీపంలోని స్టాళ్లల్లో ధరల నియంత్రణపై అన్ని దేవాలయాల ఈవోలకు... దేవాదాయశాఖ కమిషనర్ హరిజవహర్ లాల్ సర్క్యూలర్ జారీ చేశారు. సమీపంలోని దుకాణాల్లో ధరల నియంత్రణపై దృష్టిపెట్టాలని సూచించారు. దేవాలయ ప్రాంగణాల్లోని లైసెన్సు కలిగిన దుకాణాల్లో ఎమ్మార్పీ ధరలకే విక్రయాలు జరిగేలా చూడాలని ఆదేశించారు. కొబ్బరి కాయలు, పూలు, పళ్లు, తినుబండారాల ధరలను ఈవోలే నిర్దేశించాలని స్పష్టం చేస్తూ సర్కులర్ జారీ చేశారు. దుకాణ దారులతో చర్చించి ధరలను నిర్ధారించాలని సూచించారు.

Circular to temple EOS: దేవాలయాలకు వచ్చే భక్తులతో ఎలా వ్యవహరించాలన్న అంశంపై దుకాణదారులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. భక్తులతో దురుసుగా ప్రవర్తించినా, ఎక్కువ ధరలకు అమ్మినా.. లైసెన్సులు రద్దు చేస్తామనే విషయాన్ని టెండర్, యాక్షన్ నిబంధనల్లో పొందుపరచాలని ప్రకటించారు. దేవాలయాల సమీపంలోని ప్రైవేటు స్థలాల్లో ఏర్పాటు చేసుకునే స్టాళ్లల్లోనూ ధరల నియంత్రణపై దృష్టి సారించాలన్నారు. ప్రైవేట్ స్టాళ్లల్లో ధరల నియంత్రణకు పౌర సరఫరాల శాఖ సాయం తీసుకోవాలని కమిషనర్ సూచనలు ఇచ్చారు. పూర్తి స్థాయి పర్యవేక్షణ నిమిత్తం విజిలెన్స్ విభాగం ఏర్పాటు చేసుకోవాలని ఈవోలకు ఆదేశాలిచ్చారు.

ఇదీ చదవండి: High Court: ఉన్నతవిద్యా మండలి కార్యదర్శి వ్యక్తిగతంగా హాజరవ్వాలి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.