AP IN PARLIMENT: ఉపాధి హామీ నిధుల(employment funds) దుర్వినియోగానికి సంబంధించిన కేసులు దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లోనే నమోదయ్యాయి. ఈ ఏడాది జులై 30 నాటికి 1,59,570 కేసులు నమోదైనట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయమంత్రి సాధ్వీ నిరంజన జ్యోతి మంగళవారం(employment funds misuse) లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ మొత్తం కేసుల్లో దుర్వినియోగం అయిన నిధుల విలువ రూ.337.43 కోట్లుగా నమోదైనట్లు వెల్లడించారు. ఇందులో 1,11,570 కేసులపై నిర్ణయం తీసుకొని చర్యల నివేదికను అప్‌లోడ్‌చేసినట్లు తెలిపారు. ఇందులో 10,218 కేసుల నుంచి రూ.6.24 కోట్లు రికవరీ చేసినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ తర్వాత తమిళనాడులో అత్యధికంగా 1,59,027 దుర్వినియోగ కేసులు నమోదైనట్లు చెప్పారు.
1,06,042 కేజీల డ్రగ్స్ స్వాధీనం
ఆంధ్రప్రదేశ్‌లో 2020లో 1,06,042 కేజీల డ్రగ్స్(drugs in ap) స్వాధీనం చేసుక్నుట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లోక్‌సభలో తెలిపారు. రాష్ట్రంలో 2018లో 33,930 కేజీలు, 2019లో 66,669 కేజీల మాదకద్రవ్యాలు(ap drugs) స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
కార్పొరేషన్ల ద్వారా రూ.29,337 కోట్ల రుణం..కేంద్ర ప్రభుత్వం వెల్లడి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రుణాల కోసం గత రెండేళ్లలో రూ.65,489 కోట్ల గ్యారెంటీలు ఇచ్చింది. అలాగే వివిధ కార్పొరేషన్ల ద్వారా రూ.29,337 కోట్ల రుణం తీసుకుంది. తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మంగళవారం రాజ్యసభలో అడిగిన(corporation loans) ప్రశ్నలకు కేంద్ర ఆర్థికమంత్రి(Nirmala Seetharaman) నిర్మలాసీతారామన్, సహాయమంత్రి పంకజ్‌చౌధరిలు సమాధానాలు ఇచ్చారు. 2020-21లో రూ.46,719.42 కోట్లు, 2021-22లో రూ.18,770.54 కోట్ల మేర గ్యారెంటీలు ఇచ్చినట్లు ఏప్రిల్ 27వ తేదీన రాసిన లేఖలో ఏపీ ప్రభుత్వం తమకు చెప్పిందని నిర్మలాసీతారామన్ వెల్లడించారు. 2022-23 ఆర్థిక(finance year) సంవత్సరంలో ఆర్టికల్ 293(3) కింద రుణపరిమితి పెంపు కోసం విజ్ఞప్తిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ లేఖను తమకు సమర్పించినట్లు తెలిపారు. వివిధ ప్రభుత్వరంగ సంస్థలు, స్పెషల్ పర్పస్ వెహికిల్స్, ఇతర సంస్థల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 2020-21లో రూ.22,549.50 కోట్లు, 2021-22లో రూ.6,287.74 కోట్లు, 2022-23లో రూ.500 కోట్లు కలిపి మొత్తం రూ.29,337.24 కోట్ల అప్పు చేసినట్లు చెప్పారు.
ఇవీ చదవండి: