advisor chandrasekhar Reddy comments on Employees Protest: ఉద్యోగ సంఘ నాయకులు తమ సమస్యలపై పోరాటం చేయవచ్చు కాని.. ప్రభుత్వాన్ని కూల్చుతామని అనడం సరికాదని ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉద్యోగ సంఘాలు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని తాను భావించడం లేదన్నారు. ఇటీవలి వరకు తను ఉద్యోగులతో కలిసి పని చేశానని గుర్తు చేశారు.
advisor chandrasekhar Reddy on PRC: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులతో పాటు ప్రజలందరి మన్ననలు పొందారని చంద్రశేఖర్ రెడ్డి కొనియాడారు. ఉద్యోగుల సమస్యలపై సీఎం సానుకూలంగానే స్పందిస్తారని చెప్పారు. కరోనా మహమ్మారితో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందనే కారణంగా ఉద్యోగులకు రావాల్సిన రాయితీలు సకాలంలో అందలేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడూ.. ఉద్యోగుల పక్షపాతేనని చెప్పారు. అడగకపోయినా 27 శాతం మధ్యంతర భృతిని మంజూరు చేశారన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారని గుర్తు చేశారు. కుటుంబసభ్యులుగా ఉద్యోగులు కొంత బాధను వ్యక్తం చేస్తారే తప్ప... ప్రభుత్వానికి వ్యతిరేకం కాదన్నారు.
ఇదీ చదవండి: