ETV Bharat / city

Nirasana Deeksha: రివర్స్ పీఆర్సీ వద్దంటూ సచివాలయ ఉద్యోగుల నిరాహార దీక్ష - సచివాలయంలో ఉద్యోగుల దీక్ష

Secretariat Employees Nirasana Deeksha: పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా సచివాలయ ఉద్యోగులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగుల సంఘాల నేతలు డిమాండ్ చేశారు.

Nirasana Deeksha
Secretariat Employees Nirasana Deeksha
author img

By

Published : Jan 31, 2022, 3:56 PM IST

పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగుల డిమాండ్

Secretariat Employees Nirasana Deeksha: పీఆర్సీ జీవోలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. సచివాలయంలోని మూడో బ్లాక్ వద్ద ఉద్యోగులు రిలే నిరాహార దీక్షకు దిగారు. రివర్స్ పీఆర్సీ మాకొద్దని నినాదాలూ చేస్తూ.. ప్లకార్డులు ప్రదర్శించి ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఉద్యమాన్ని ఆపడం ఎవరితరం కాదన్న ఉద్యోగులు..ఈనెల 3న 'చలో విజయవాడ' నిర్వహించి తీరుతామన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే సమ్మె తప్పదని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఉద్యోగుల్లో చీలిక తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. బెదిరింపులకు పాల్పడి కొత్త వేతన స్కేళ్ల ఆధారంగా బిల్లులు చేయిస్తున్నారని ఉద్యోగులు మండిపడ్డారు. ఆ కమిటీ అపోహలు తొలగించే కమిటీ కాదు.. ఉద్యోగుల పొట్ట మీద కొట్టే కమిటీ అని దుయ్యబట్టారు. ప్రభుత్వం, ఉద్యోగులు ఒక కుటుంబం కాదు యజమాని, ఉద్యోగి సంబంధమేనని సచివాలయ ఉద్యోగులు వెల్లడించారు.

ఇదీ చదవండి..

నిర్మలమ్మ పద్దుపై ఆశలెన్నో.. వివిధ రంగాలు ఏం కోరుతున్నాయంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.