రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్‌కు ఉద్యోగుల కేటాయింపుపై కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ - ఏపీ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల మధ్య ఉద్యోగుల విభజనపై అధికారుల కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబు ఛైర్మన్‌గా ఏపీఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్ సీఎండీలు సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేశారు. నిబంధనల మేరకు రెండు డిస్కంల మధ్య ఉద్యోగులను తాత్కాలిక ప్రాతిపదికన విభజించనున్నారు. ఉద్యోగుల విభజనకు సంబంధించిన నివేదికను వీలైనంత త్వరగా సమర్పించాల్సిందిగా అధికారుల కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి..