ETV Bharat / city

మూడేళ్లు సమీపిస్తున్నా అమలుకాని ‘పింఛను’ హామీ.. ఆందోళన చేస్తే నిర్బంధాలు.. - ఏపీలో సీపీఎస్ పోారాటం వార్తలు

అధికారంలోకి వచ్చిన వారంలోగా సీపీఎస్‌ రద్దు చేస్తానని హామీనిచ్చిన సీఎం జగన్‌ .. మూడేళ్లు గడుస్తున్నా చర్చలు, కమిటీల దశలోనే ఈ హామీ మిగిలిందని ఉద్యోగులు వాపోయారు. పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా మార్చి 31లోపు రోడ్‌మ్యాప్‌ ప్రకటిస్తామని సీఎం జగన్‌ స్వయంగా చెప్పినా  కార్యరూపం కనిపించడం లేదన్నారు. సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు ఏర్పాటుచేసిన సమావేశాలను ఇప్పటివరకు రెండుసార్లు వాయిదా వేశారన్నారు.

CPS protest
CPS protest
author img

By

Published : Apr 24, 2022, 4:58 AM IST

అధికారంలోకి వచ్చిన వారంలోగా కంట్రిబ్యూటరీ పింఛను పథకాన్ని (సీపీఎస్‌) రద్దు చేస్తానని హామీనిచ్చిన సీఎం జగన్‌ ఇంతవరకు అమలు చేయలేదు. ఎన్నికల ముందు ప్రతి సభలోనూ రద్దు చేస్తామనే ప్రకటించారు. పార్టీ మేనిఫెస్టోలోనూ చేర్చారు. ఈ హామీని ఉద్యోగులు నమ్మారు. మూడేళ్లు గడుస్తున్నా చర్చలు, కమిటీల దశలోనే ఈ హామీ మిగిలింది. 2019 ఆగస్టు 1న మంత్రుల కమిటీ, అదే ఏడాది నవంబరు 27న అధికారుల కమిటీని ఏర్పాటుచేశారు. ఇవితప్ప ఇంతవరకు దీనిపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా మార్చి 31లోపు రోడ్‌మ్యాప్‌ ప్రకటిస్తామని సీఎం జగన్‌ స్వయంగా చెప్పినా కార్యరూపం కనిపించడం లేదు. సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు ఏర్పాటుచేసిన సమావేశాలను ఇప్పటివరకు రెండుసార్లు వాయిదా వేశారు. మరోసారి ఈనెల 25న నిర్వహించనున్నారు. ఈ చర్చలకు సీపీఎస్‌ ఉద్యోగ సంఘాలను మాత్రం ఆహ్వానించలేదు.

కమిటీలతోనే..

ఉమ్మడి రాష్ట్రంలో 2004 సెప్టెంబరు 1నుంచి సీపీఎస్‌ అమలుచేస్తున్నారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు తెదేపా హయాంలో 2018 డిసెంబరులో టక్కర్‌ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ ఉద్యోగులు, ఉపాధ్యాయులతో చర్చించి నివేదిక సమర్పించింది. జగన్‌ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో అధికారుల కమిటీ, ఆ తర్వాత మంత్రుల కమిటీ ఏర్పాటైంది. సీపీఎస్‌ రద్దు తప్ప మరో దానికి అంగీకరించేది లేదని ఉద్యోగ సంఘాలు తొలినుంచి పట్టుబడుతున్నాయి. ఆందోళనలు చేస్తున్నాయి. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాలు సీపీఎస్‌ రద్దు చేసి పాత పింఛను విధానాన్ని కొనసాగించేందుకు చర్యలు చేపట్టాయి. సీపీఎస్‌ రద్దుకు దిల్లీ శాసనసభ తీర్మానించింది. ఎన్నో రాష్ట్రాలు పునరాలోచిస్తుండగా, ఎన్నికల హామీ, మేనిఫెస్టోలో ఉన్నా ప్రస్తుతం సాగదీతే కొనసాగుతోంది. రాష్ట్రంలో 1.90లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల క్రమబద్ధీకరణ పూర్తయితే వారిసంఖ్య 3లక్షలకుపైగా చేరుతుంది.

జగన్‌ అనే నేను అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తానని చెబుతున్నా. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి మాట ఇస్తున్నా. ఎన్నికలకు వెళ్లేటప్పుడు ప్రతి పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తుంది. అందులోని ప్రతి మాటను రాజకీయ పార్టీ నిలబెట్టుకోవాలి. అలా నిలబెట్టుకోలేకపోతే ఆ నాయకుడు పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి తీసుకురావాలి. - ప్రతిపక్ష నేతగా పలు సభల్లో జగన్‌

పదవీ విరమణ తరువాత సీపీఎస్‌ ఉద్యోగుల పరిస్థితేమిటి? అనేదానిపై ప్రతిపక్ష నేతగా హామీ ఇచ్చిందే తప్ప ఇందులో టెక్నికల్‌ సబ్జెక్టు మాకూ తెలియదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే మొత్తం బడ్జెట్‌ సరిపోయేట్టు లేదు. మళ్లీ ఏం చేయాలని తర్జనభర్జన పడ్డాం. సీపీఎస్‌ను రద్దు చేస్తే పదవీ విరమణ తర్వాత ఉద్యోగికి భద్రత లభిస్తుంది. వారికి ఇంకోలా ఎలా భద్రత కల్పించవచ్చనే 2,3 ఆలోచనలపై చర్చించాం. -పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో చర్చల అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

పాత పింఛనుతోనే దన్ను

పాత పింఛను విధానం ఉద్యోగులకు భరోసానిస్తుంది. పింఛను పొందడానికి వారు కంట్రిబ్యూషన్‌ చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ వాటా సొమ్ము చెల్లింపు ఉండదు. ఉద్యోగులు ప్రతి నెలా పీఎఫ్‌ కొంత జమచేస్తారు. దీనిపై ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుంది. పదవీ విరమణ తర్వాత పింఛను చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. డీఏ పెరిగినప్పుడు, పీఆర్సీ అమలు చేసినప్పుడు పింఛను పెరుగుతుంది. సీపీఎస్‌ విధానంలో పింఛను ఫండ్‌ ఏర్పడినప్పటికీ ప్రభుత్వ అజమాయిషీలో ఉండదు. ప్రభుత్వం, ఉద్యోగులు వాటా చెల్లించాలి. పదవీ విరమణ తర్వాత ఉద్యోగి భద్రతను బీమా కంపెనీలకు, యాన్యుటీ ప్రొవైడర్లకు బదలాయిస్తారు. ఉద్యోగులకు డీఏలు, పీఆర్సీలు వర్తించవు. పింఛను పెంపు ఉండదు. సీపీఎస్‌ రద్దు కోరుతూ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (యూటీఎఫ్‌) రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 18నుంచి ‘పోరుగర్జన బైక్‌ ర్యాలీ’ చేపడుతోంది. 25న విజయవాడలో రాష్ట్రస్థాయి భారీ ర్యాలీ నిర్వహించనుంది. పథకం అమల్లోకి వచ్చిన సెప్టెంబరు1న ఏపీసీపీఎస్‌ ఉద్యోగ సంఘాలు రణభేరికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికేవారు పలుమార్లు ఆందోళనలు, ధర్నాలు నిర్వహించారు.

రద్దు తప్ప ప్రత్యామ్నాయం లేదు

సీపీఎస్‌ రద్దు తప్ప ప్రత్యామ్నాయాలకు అంగీకరించేది లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలి. కమిటీలు, చర్చలంటూ జాప్యం తగదు. ఉద్యోగుల ఆందోళనలను ప్రభుత్వం అడ్డుకుంటోంది. హామీ అమలును కోరితే ఉపాధ్యాయ సంఘాలపై ఎదురుదాడి చేస్తోంది. -యూటీఎఫ్‌ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు

120సార్లు హామీ ఇచ్చారు

సీపీఎస్‌ రద్దు చేస్తానని ఎన్నికల ముందు సీఎం జగన్‌ 120సార్లు హామీ ఇచ్చారు. సీపీఎస్‌ ఉద్యోగులను పార్టీ కార్యకర్తల్లా వాడుకొని ఎన్నికల్లో గెలిచి మూడేళ్లవుతున్నా పట్టించుకోవడం లేదు. దీని రద్దు తప్ప మరొకటి మాకొద్దు.- అప్పలరాజు, ఏపీ సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

నిర్బంధాలేమిటి?

మ్యానిఫెస్టో అమలుచేయకపోతే నిలదీసే పరిస్థితులు రావాలని సీఎం జగన్‌ అన్నారు. ఇప్పుడు ప్రశ్నిస్తుంటే నిర్బంధాలు విధిస్తున్నారు. ఎన్నికల హామీ మేరకు రద్దు చేయాల్సిందే. - దాస్‌, ఏపీ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు

ఇదీ చదవండి: sajjala: సీపీఎస్‌ రద్దు చేస్తే దానికే బడ్జెట్‌ సరిపోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.