ETV Bharat / city

వినియోగదారుల నుంచి ఆమ్యామ్యాలు డిమాండ్‌.. మొదటి స్థానంలో ఏపీ - ఏపీ విద్యుత్ ఉద్యోగుల వార్తలు

అమ్యామ్యాల్లో ఏపీ విద్యుత్తు ఉద్యోగులు మొదటి స్థానంలో ఉన్నారని నీతి ఆయోగ్ సర్వేలో వెల్లడించింది. 57% మంది వినియోగదారులకు  ఈ అనుభవం ఎదురైందని పేర్కొంది.

ap  power employees
ap power employees
author img

By

Published : Nov 13, 2020, 6:33 AM IST

వినియోగదారుల నుంచి ఆమ్యామ్యాలు డిమాండ్‌ చేయడంలో ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు సిబ్బంది దేశంలోనే మొదటి స్థానం(టాప్‌)లో ఉన్నట్లు నీతి ఆయోగ్‌ నివేదికలో వెల్లడైంది. సర్వే చేసిన వినియోగదారుల్లో 57% మంది తమకు ఇలాంటి పరిస్థితి ఎదురైందని చెప్పినట్లు పేర్కొంది.

‘‘ఎలక్ట్రిసిటీ యాక్సెస్‌ ఇన్‌ ఇండియా: బెంచ్‌మార్కింగ్‌ డిస్ట్రిబ్యూషన్‌ యుటిలిటీస్‌’ పేరుతో రూపొందించిన నివేదికలో వినియోగదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను చర్చించి, వాటికి పరిష్కార మార్గాలను సూచించింది. ‘చేసిన పనికి నిర్దేశిత మొత్తానికంటే అదనపు ప్రయోజనాలు ఇవ్వాలని విద్యుత్తు ఉద్యోగులు అడుగుతున్నట్లు దేశవ్యాప్తంగా గృహ వినియోగదారుల్లో 33% మంది, సంస్థాగత వినియోగదారుల్లో 21%.. మొత్తంగా 32% మంది పేర్కొన్నారు.

ఈ అదనపు మొత్తాల సంస్కృతి గుజరాత్‌లో అతి తక్కువగా 8% ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు, దక్షిణ డిస్కంల పరిధిలో అత్యధికంగా 57% ఉంది’ అని నివేదికలో పేర్కొంది. విద్యుత్తు సమస్యలు తెలుసుకోవడానికి దేశవ్యాప్తంగా 25 డిస్కంల పరిధిలో 25,116 మందిని సర్వేచేశారు. అందులో ఆంధ్రప్రదేశ్‌లో 1,809 మంది ఉన్నారు. ఈ విషయంలో డిస్కంలు వినియోగదారులను చైతన్య పరచడంతోపాటు, అదనపు మొత్తాలను అడిగే సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సి ఉందని నీతి ఆయోగ్‌ పేర్కొంది.

మరికొన్ని అంశాలు..

* వినియోగదారులకు అందుబాటులో ఉండటంలో కర్ణాటక డిస్కంలు టాప్‌లో ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లోని ఈస్ట్‌ డిస్కం చిట్టచివరన ఉంది.

* ఆంధ్రప్రదేశ్‌లోని గృహ విద్యుత్తు వినియోగదారులు గ్రిడ్‌ కనెక్షన్‌, మౌలిక వసతులకు సంబంధించిన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. తూర్పు డిస్కం పరిధిలోని వ్యవసాయ వినియోగదారులకు సరైన మౌలిక వసతులు అందుబాటులో లేవు. వాణిజ్య వినియోగదారులకు దక్షిణ డిస్కం పరిధిలో గ్రిడ్‌ కనెక్షన్‌ సమస్య ఉంది.

* దక్షిణ డిస్కం పరిధిలో కొత్త కనెక్షన్ల విషయంలో, తూర్పు డిస్కం పరిధిలో విద్యుత్తు నాణ్యత విషయంలో వినియోగదారులు అసంతృప్తితో ఉన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్త ఇసుక విధానం... ఉత్తర్వులు జారీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.