వైఎస్సార్ ఆసరా పథకం రెండో విడత కార్యక్రమానికి ఎన్నికల సంఘం అనుమతి మంజూరు చేసింది. బద్వేలు ఉప ఎన్నిక నేపథ్యంలో పథకాల ప్రారంభానికి అనుమతి ఉండదు కానీ.. పథకం కొత్తది కాకపోవటంతో రెండో విడత కార్యక్రమం అమలుకు క్లియరెన్సు ఇచ్చినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం స్పష్టం చేసింది.
ఎన్నికల సంఘం నుంచి అనుమతి రావటంతో గురువారం ఉదయం ఒంగోలులో ముఖ్యమంత్రి జగన్ వైఎస్సార్ ఆసరా రెండో విడత నిధుల విడుదల కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఆసరా రెండో విడత కింద 6,439 కోట్ల రూపాయలను 78.76 లక్షల మంది డ్వాక్రా మహిళల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది.
ఇదీ చదవండి : APSRTC: పండక్కి 4వేల ప్రత్యేక బస్సులు: ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు