జులై 10 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. విజయవాడలోని సమగ్ర శిక్షా అభియాన్ కార్యాలయంలో పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్షల నాటికి ఇప్పుడు గుర్తించిన ప్రాంతాల్లో కరోనా కేసులు వస్తే అందుకు అనుగుణంగా మార్పులు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
పరీక్షల నిర్వహణపై మంత్రి ఏమన్నారంటే..
- ప్రతి గదిలో 10 నుంచి 12 మంది
- మొత్తం 4,154 పరీక్ష కేంద్రాలు
- ప్రతి పరీక్షా కేంద్రం వద్ద అందుబాటులో శానిటైజర్లు, థర్మల్ స్క్రీనింగ్, మాస్కులు
- టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులకు 8 లక్షల మాస్కులు
- పది రోజుల ముందే ఏర్పాట్లు పూర్తయ్యేలా చర్యలు
- ఓపెన్ స్కూల్ విద్యార్థులకు 1,022 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ
- కంటైన్మెంట్ జోన్లలో పరీక్ష కేంద్రాలకు అనుమతి లేదు
- ఇందుకోసం మరో 10 శాతం పరీక్ష కేంద్రాల ఏర్పాటు.
- రెసిడెన్షియల్ విద్యార్థులకు ఒక రోజు ముందు నుంచి హాస్టల్ వసతి
- సాధ్యమైనంత వరకు ఎక్కడివారు అక్కడే పరీక్షలు రాసేలా ఏర్పాట్లు
ఇదీ చూడండి..