ETV Bharat / city

SCHOOL FEE: విద్యాసంస్థల్లో ప్రవేశాలు మొదలు.. ఫీజుల ఖరారు ఎప్పుడో? - ఏపీ విద్యాశాఖ వార్తలు

విద్యా సంస్థల్లో ప్రవేశాలు మొదలయ్యాయి. అయినప్పటికీ ఫీజుల విషయంలో ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. ఫీజులకు సంబంధించిన దస్త్రం ప్రభుత్వం వద్ద పెండింగ్​లో ఉంది. గతేడాదీ రుసుములను నిర్ణయించేందుకు సమయం సరిపోదంటూ పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఫీజులను ఖరారు చేయలేదు.

collega fees issue
collega fees issue
author img

By

Published : Jul 4, 2021, 8:16 AM IST

ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలు ప్రారంభమైనా విద్యాశాఖ ఇంతవరకు బోధన రుసుములను ప్రకటించలేదు. గతేడాది రుసుములను నిర్ణయించేందుకు సమయం సరిపోదంటూ పాఠశాల విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఫీజులను ఖరారు చేయలేదు. 2019-2020 రుసుములనే 2020-21లోనూ తీసుకోవాలని యాజమాన్యాలకు సూచించింది. కరోనా కారణంగా ట్యూషన్‌ ఫీజులో 30శాతం రాయితీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈసారి సమయం ఎక్కువగా ఉన్నా ఇంతవరకు ఫీజులను ప్రకటించలేదు. పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు కమిషన్‌ బోధన రుసుములను ఖరారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వాటికి ఆమోదం లభించడంలో జాప్యం జరుగుతోంది.

పాఠశాలలు, కళాశాలల్లో వసతి గృహాలు, కోచింగ్‌ కేంద్రాలకు విడివిడిగా ఈసారి ఫీజులను నిర్ణయించనున్నారు. చాలా జూనియర్‌ కళాశాలలు ఇంటర్‌తోపాటు జేఈఈ, ఎంసెట్‌, నీట్‌ కోచింగ్‌లు, వసతి గృహాలు నిర్వహిస్తున్నాయి. వీటన్నింటికి కలిపి రుసుములను వసూలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్‌, కోచింగ్‌, వసతి గృహాలకు విడివిడిగా రుసుములను కమిషన్‌ ఖరారు చేసినట్లు సమాచారం. కళాశాలల వసతి గృహాలకు కేటగిరీల వారీగా రూ.20వేలు, రూ.25వేలు, రూ.30వేలుగా నిర్ణయించినట్లు తెలిసింది. పాఠశాలలకు రూ.18వేలు, రూ.20వేలు, రూ.24వేలుగా ఉండనున్నాయి. కోచింగ్‌కు రూ.20వేలుగా ఉండనుంది.

ఇదీ చదవండి:Financial difficulties:రాష్ట్రానికి ఆర్థిక కష్టాలు.. ఆదాయం కంటే వ్యయమే ఎక్కువ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.