ETV Bharat / city

ఈఏపీ సెట్​కు ఏర్పాట్లు పూర్తి: విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు

జులై 4 నుంచి 12 వరకు ఈఏపీ సెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు స్పష్టంచేశారు. 4వ తేదీ నుంచి 8 వరకు ఇంజినీరింగ్ పరీక్ష , 11వ తేదీ నుంచి 12 వరకు అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్ష జరుగుతుందని తెలిపారు. 122 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని ఏపీలో 120 సెంటర్లు, తెలంగాణలో రెండు సెంటర్లు ఏర్పాటు చేశామని శ్యామలరావు పేర్కొన్నారు. 3 లక్షల 84 వేల మంది పరీక్షలు రాసేందుకు నమోదు చేసుకున్నారని తెలిపారు.

ఉన్నత విద్యామండలి
ఉన్నత విద్యామండలి
author img

By

Published : Jul 2, 2022, 6:47 PM IST

రాష్ట్రంలో ఈఏపీ సెట్​కు అన్నీ ఏర్పాట్లు చేశామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు స్పష్టం చేశారు. జులై 4 నుంచి 12 వరకు ఈఏపీ సెట్ పరీక్షలు జరుగుతాయని అన్నారు. 4వ తేదీ నుంచి 8 వరకు ఇంజినీరింగ్ పరీక్ష , 11 నుంచి 12 వరకు అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్ష జరుగుతుందని తెలిపారు. 122 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని, ఏపీలో 120 సెంటర్లు, తెలంగాణలో రెండు సెంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పరీక్షలు రాసేందుకు 3 లక్షల 84 వేల మంది నమోదు చేసుకున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాలకు సంబంధించిన రూట్ మ్యాప్​ని హాల్ టికెట్​తో పాటు ఇస్తున్నామన్నారు.

నిమిషం నిబంధన..

నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని, ఈ నిబంధన ఖచ్చితంగా అమలవుతుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రా రెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఖచ్చితంగా కుల ధ్రువీకరణ పత్రాలు తెచ్చుకోవాలని ఆయన సూచించారు. ఎలక్ట్రానిక్ వస్తువులు తెచ్చినా, ఒకరి బదులు ఒకరు పరీక్ష రాసినా క్రిమినల్ కేసులు పెడతామని ఆయన హెచ్చరించారు. పరీక్షా కేంద్రాలకు ఆర్టీసీ బస్​లు, సెంటర్లలో మెడికల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కోరామన్నారు. మాస్క్ తప్పని సరిగా తెచ్చుకోవాలన్నారు. ఏవైనా సందేహాలుంటే 08554-234311,232248 హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చునని వివరించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.