ETV Bharat / city

జూన్ 14 తర్వాత తెలంగాణ ఎంసెట్: ఉన్నత విద్యామండలి - ఎంసెట్-2021

జూన్ 14 తర్వాత తెలంగాణ ఎంసెట్ నిర్వహిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు. అయితే ఎంసెట్​లో ఇంటర్ మార్కులకు వెయిటేజ్ ఉంటుందని ఆ రాష్ట్ర విద్యా శాఖ తెలిపింది.

eamcet-exam-will-conduct-after-june-in-2021
జూన్ 14 తర్వాత ఎంసెట్: ఉన్నత విద్యామండలి
author img

By

Published : Feb 5, 2021, 7:58 PM IST

ఎంసెట్‌పై విద్యా శాఖ ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. జూన్ 14 తర్వాత ఎంసెట్ నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు. ఎంసెట్‌లో ఇంటర్ తొలి ఏడాది నుంచి 100 శాతం సిలబస్ ఉంటుందని విద్యా శాఖ కార్యదర్శి చిత్రా రామచంద్రన్ తెలిపారు. ఇంటర్ ద్వితీయ ఏడాది నుంచి 70 శాతం సిలబస్ ఉంటుందన్నారు. సాయంత్రం ఎంసెట్ సిలబస్ విడుదల చేస్తామని వెల్లడించారు.

జేఈఈ మెయిన్‌లో ఇంటర్‌ మార్కుల వెయిటేజీని రెండేళ్ల క్రితమే తొలగించారు. ఈ క్రమంలో ఎంసెట్‌లో దీన్నెందుకు కొనసాగించాలనే ప్రశ్న ఉత్పన్నమవుతోన్న తరుణంలో ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజ్ యథాతథం ఉంటుందని విద్యా శాఖ తెలిపింది. కరోనా పరిస్థితుల కారణంగా ప్రస్తుతం ఆన్‌లైన్‌ బోధన కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉందని, వెయిటేజీ ఇస్తే కార్పొరేట్‌ విద్యార్థులే లబ్ధిపొందుతారని వాదన వినిపిస్తోంది.

ఇదీచదవండి: కుదేలైన దేశానికి ఆర్థిక టీకా- ఏ రంగానికి ఎంత?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.