ETV Bharat / city

మాస్కుల కుట్టు కూలీ ఎప్పుడు?: డ్వాక్రా మహిళలు - Dwakra women updates

ప్రభుత్వ పిలుపు మేరకు పెద్ద ఎత్తున మాస్కులు కట్టిన ద్వాక్రా మహిళలు.. ఏడాదిగా వాటి బకాయిల కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్కో మాస్కు తయారీకిగానూ కుట్టినందుకు రూ.3, కటింగ్‌కు 50 పైసలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇలా కుట్టిన మాస్కులకు కొంత మేర ప్రభుత్వం బిల్లులు చెల్లించినా ఇంకా రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాల్లో బకాయిలున్నాయి.

Dwakra women
ద్వాక్రా మహిళలు
author img

By

Published : Aug 10, 2021, 1:51 PM IST

గత ఏడాది కరోనా మహమ్మారి విరుచుకుపడిన వేళ.. ప్రభుత్వ పిలుపు మేరకు పెద్ద ఎత్తున మాస్కులు కుట్టి ఆసరాగా నిలిచిన డ్వాక్రా మహిళలకు ఇప్పటికీ కూలి బకాయిలు అందలేదు. వెంటనే నిధులు విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. వీలైనంత వేగంగా మాస్కులను ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో డ్వాక్రా మహిళలకు శిక్షణ ఇచ్చి ఆప్కో నుంచి వస్త్రాన్ని కొనుగోలు చేసి పట్టణ పరిధిలో మెప్మా ఆధ్వర్యంలో, గ్రామీణ పరిధిలో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో మాస్కులు కుట్టించారు. ఒక్కో మాస్కు తయారీకిగానూ కుట్టినందుకు రూ.3, కటింగ్‌కు 50 పైసలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో కుటుంబానికి చేయూతగా ఉంటుందని మహిళలు రేయింబవళ్లు శ్రమించి ప్రభుత్వానికి మాస్కులు అందించారు. ఇలా కుట్టిన మాస్కులకు కొంత మేర ప్రభుత్వం బిల్లులు చెల్లించినా ఇంకా రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాల్లో బకాయిలున్నాయి. వీటి కోసం ఏడాదిగా మహిళలు ఎదురు చూస్తున్నారు. బకాయిలపై అధికారులకు విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళల నుంచి ఒత్తిడి రావడంతో కొన్ని చోట్ల మండల సమాఖ్యల నుంచి చెల్లింపులు జరిపారు. ఇదే కాకుండా వస్త్రం, మాస్కులు రవాణా చేసేందుకు అయిన ఛార్జీని మండల సమాఖ్యలకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.

  • నెల్లూరు జిల్లాలో మెప్మా పరిధిలో మొదటి దశలో 2వేల మంది డ్వాక్రా మహిళలు 26 లక్షల మాస్కులు కుట్టారు. వీరికి రూ.91 లక్షలు చెల్లించాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.30 లక్షలే చెల్లించారు. డీఆర్‌డీఏ పరిధిలో 2,500 మంది మహిళలు చిన్నారులు, పెద్దలకు కలిపి 76,54,971 మాస్కులు కుట్టారు. ఇందుకుగానూ ఇంకా రూ.36 లక్షల బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటిలో రూ.25 లక్షలు సీఎఫ్‌ఎమ్‌ఎస్‌కు ప్రభుత్వం పంపిందని, త్వరలో జమవుతాయని అధికారులు అంటున్నారు.
  • విజయనగరం జిల్లా డీఆర్‌డీఏ పరిధిలో చిన్నారుల కోసం 6,28,035 మాస్కులు కుట్టారు. వీటికి సంబంధించిన నగదు అందించలేదు. పెద్దవారికి కుట్టిన మాస్కులకు సంబంధించి రూ.4 లక్షల మేర బకాయిలు ఉన్నాయి.
  • గుంటూరు జిల్లాలో పాఠశాల విద్యార్థుల కోసం 11,42,394 మాస్కులు కుట్టించారు. వీటికి ఇటీవల ప్రభుత్వం రూ.45 లక్షలు మంజూరు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. పెద్దవారి కోసం 32,03,074 మాస్కులు కుట్టారు. వీటికి రూ.25 లక్షల మేర ఇంకా చెల్లింపులు చేయాల్సి ఉంది.
  • చిత్తూరు డీఆర్‌డీఏ పరిధిలో రూ.60 లక్షలు చెల్లించాల్సి ఉంది. కర్నూలు జిల్లాలో రూ.20.52 లక్షల బకాయిలు ఉన్నాయి. విశాఖ గ్రామీణ పరిధిలో రూ.6.74 లక్షలు అందించాల్సి ఉంది. కడప జిల్లాలో రూ.4 లక్షల బకాయిలు చెల్లించాలి. ఈ మొత్తాన్ని మండల సమాఖ్య నుంచి చెల్లించాలని ఆదేశించినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నిధులిచ్చాక తిరిగి మండల సమాఖ్యలో జమ చేయనున్నట్లు తెలిపారు. అనంతపురం జిల్లాలోని కొన్ని మండలాల్లో మండల సమాఖ్యల నుంచి బకాయిలు చెల్లించారు. శ్రీకాకుళం జిల్లాలో మెప్మా పరిధిలో, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలో మహిళలకు పూర్తిగా చెల్లింపులు చేసినట్లు అక్కడి అధికారులు చెప్పారు.

ఇదీ చదవండి

ఎస్సీ ప్రతిఘటన ర్యాలీకి వెళ్లకుండా నక్కా ఆనందబాబును అడ్డుకున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.