మత్తుకు అలవాటు పడిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి వద్ద ఆబ్కారీ పోలీసులు 12 ఎల్‌ఎస్‌డీ బోల్ట్స్ డ్రగ్స్Drugs seized in medchal)ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ యూసుఫ్గూడాకు చెందిన సాయికిరణ్ బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. మొదటి సంవత్సరం నుంచే మత్తుకు అలవాటు పడిన సాయికిరణ్.. గోవా నుంచి రెండు నెలలకు సరిపడా మత్తుపదార్థాలు తెచ్చుకునేవాడు.
ముందస్తు సమాచారం ప్రకారం సాయికిరణ్‌ను పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు అతని నుంచి రూ.50వేలు విలువ చేసే డ్రగ్స్ సీజ్ చేశారు. మత్తుకు అలవాటు పడి అతను బీటెక్‌ను మధ్యలోనే ఆపివేసినట్లు ఆబ్కారీ సూపరింటెండెంట్ విజయభాస్కర్ తెలిపారు. నగరంలోని విద్యాసంస్థలు, రేవ్ పార్టీలు, ఫామ్‌హౌజ్‌ల వద్ద తరచూ ఆబ్కారీ తనిఖీలు జరుగుతాయని.. మత్తు పదార్థాల వాడకం కట్టడికి కఠిన చర్యలు చేపడుతున్నామని వివరించారు.
"యువత గంజాయి సేవించడం అలవాటుగా మార్చకోవడం.. వారి పెడధోరణికి అద్దం పడుతోంది. అన్నిచోట్ల విరివిగా సరుకు అందుబాటులో ఉండటం వల్ల యువత క్రమంగా ఆ వ్యసనానికి బానిస అవుతున్నారు. బీరు, సిగరెట్‌తో మొదలై... క్రమంగా మాదకద్రవ్యాల వైపు ఆకర్షితులై తరువాత నేరాలకూ వెనకాడటం లేదు. మేడ్చల్ జిల్లా మూణ్నెళ్లలో గంజాయి సంబంధిత 20 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో గంజాయి మత్తు పదార్థాలు అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇప్పటికే చాలా చోట్ల దాడులు నిర్వహించాం. సరిహద్దు ప్రాంతాల్లో నిఘాతో పాటు తనిఖీలు నిర్వహిస్తున్నాం. గంజాయి విక్రయిస్తున్న తరలిస్తున్న తమకు సమాచారం ఇవ్వాలి"
- విజయభాస్కర్, అబ్కారీ సూపరింటెండెంట్, మేడ్చల్
ఇదీ చదవండి : Drugs Case News: మేడ్చల్ జిల్లాలో చాపకింద నీరులా డ్రగ్స్.. మూణ్నెళ్లలోనే 20 కేసులు..!