భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఛైర్మన్ జి.సతీశ్ రెడ్డి.. రెండు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రక్షణ రంగ సంస్థలను సందర్శించడంతో పాటు అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించనున్నారు. ఈనెల 23న రాత్రి విజయవాడ చేరుకుని అక్కడి నుంచి గుంటూరుకు వెళ్లనున్నారు. 24న గుంటూరులో జరిగే ఓ ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం కృష్ణా జిల్లాకు బయలుదేరి వెళ్లి నాగాయలంకలో డీఆర్డీవో క్షిపణి పరీక్ష కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించిన అనంతరం విజయవాడ చేరుకుంటారు.
25న ఉదయాన్నే బెజవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకుంటారు. తరువాత విజయవాడలో పలువురు అధికారులు, సాంకేతిక నిపుణులు, విద్యారంగ ప్రముఖులతో సమావేశమవుతారు. అదేరోజు రాత్రి హైదరాబాద్రు వెళ్లనున్నారు.
ఇదీ చదవండి..
CM Jagan alert on rains: భారీ వర్షాలు... అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు