రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ 130వ జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరులో హోంమంత్రి సుచరిత.. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతికి కృషి చేసిన మహా నేత అని కొనియాడారు. కడప జిల్లా పులివెందులలో ఎంపీ అవినాష్‌రెడ్డి.. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలువేసి అంజలి ఘటించారు. విజయనగరంలో బాలాజీ జంక్షన్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి..జిల్లా కలెక్టర్, ఎస్పీ పూలమాలలువేసి నివాళులర్పించారు. సమాజంలో వెనుకబాటుతనం పోవాలంటే విద్యే మార్గమని సూచించారు.
ఇదీ చదవండి: క్లేమోర్ మైన్స్‌కే బెదరలేదు గులకరాళ్లకు భయపడతానా?:చంద్రబాబు