ETV Bharat / city

వార్తల్లోకెక్కిన "పుల్లారెడ్డి స్వీట్స్​" కుటుంబం.. మనువడిపై గృహహింస కేసు.. - Domestic violence cases on eknath reddy

స్వచ్ఛమైన నేతి మిఠాయిలకు కేరాఫ్​ అడ్రస్​గా పుల్లారెడ్డి స్వీట్స్​ ప్రఖ్యాతిగాంచగా.. దాని యజమాని పుల్లారెడ్డి కుటుంబం వార్తల్లోకెక్కింది. పుల్లారెడ్డి మనువడైన ఏక్​నాథ్​రెడ్డిపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. ఏక్​నాథ్​రెడ్డిపై ఫిర్యాదు చేసింది అతడి భార్యే కావటం చర్చనీయాంశమైంది.

పుల్లారెడ్డి మనువడిపై వరకట్నం, గృహహింస కేసు

author img

By

Published : May 14, 2022, 5:05 PM IST

ప్రముఖ మిఠాయి దుకాణం యాజమాని పుల్లారెడ్డి మనువడిపై వరకట్నం, గృహహింస కేసు నమోదైంది. పుల్లారెడ్డి మనువడు ఏక్‌నాథ్‌ రెడ్డిపై అతని భార్య హైదరాబాద్​లోని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పంజాగుట్ట పోలీస్​స్టేషన్ పరిధిలో నివాసముంటున్న ఏక్‌నాథ్​రెడ్డి దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే.. వీరుంటున్న భవనంలోని పైఅంతస్తు నుంచి తన భార్య కిందకు రాకుండా బంధించాలని ఏక్​నాథ్​ రెడ్డి తలచాడు. మెట్ల వద్ద.. రాత్రికి రాత్రే అడ్డు గోడ కట్టించాడు. అనంతరం ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు.

ఇదంతా గ్రహించిన బాధితురాలు డయల్‌ 100కు ఫోన్‌ చేసి తన పరిస్థితిని వివరించింది. వెంటనే స్పందించిన పంజాగుట్ట పోలీసులు.. బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెకు బయటకు తీసుకువచ్చారు. అనంతరం బాధితురాలు.. తన తండ్రితో కలిసి ఠాణాకు వచ్చి ఏక్‌నాథ్ రెడ్డిపై వరకట్న వేధింపులతో పాటు గృహహింసకు పాల్పడుతున్నాడని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది.

ఇవీ చూడండి:

'ఏ మొహం పెట్టుకుని వస్తారు'.. అమిత్‌షాకు రేవంత్‌ రెడ్డి 9 ప్రశ్నలు

ట్రెండ్ మార్చిన సాధువులు.. ఫైవ్ స్టార్ హోటళ్లలో సమావేశాలు

అందాల నటి, ఎంపీ 'నుస్రత్​ జహాన్​​' ప్రేమ కథలో ఎన్ని ట్విస్టులో..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.