ETV Bharat / city

వీడియో కాల్స్​లో అలా మాట్లాడకూడదా! - ఆఫీస్​ మీటింగుల్లో మొబైల్​ వాడకండి

కరోనా ప్రభావంతో కార్పొరేట్​ సంస్థ ఉద్యోగులు వర్క్​ ఫ్రం హోమ్​ ద్వారానే పనిచేస్తున్నారు. అయితే.. విధుల్లో ఎక్కువ సమయం వీడియో కాల్స్​లో మాట్లాడాల్సి ఉంటుంది. . వీడియో కాల్స్‌ని మ్యూట్‌ చేసి, వీడియో కనిపించకుండా వ్యక్తిగత ఫోన్‌ కాల్స్‌ మాట్లాడుతుండటం వంటివి ప్రతి ఉద్యోగి చేసే పనే. అయితే అలా అతిగా మాట్లాడటం మంచిది కాదంటున్నారు ఆర్గనైజేషనల్​ సైకాలజిస్ట్​ కవితా గూడపాటి సూచించారు.

mobile using in meeting
మీటింగ్​లో పోన్ వాడకం
author img

By

Published : Oct 7, 2020, 12:46 PM IST

గంటల తరబడి వీడియో కాల్స్‌లో సమావేశాలకి హాజరవుతున్న అనేక మంది అలసటకు గురవుతున్నారు. మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు వీడియోకాల్స్‌లోనూ అప్రమత్తంగా కొందరుంటే, సిగ్నల్స్‌ లేవని సాకులు చెప్పి ఎగ్గొట్టేవారు మరికొందరు. పనిపట్ల నిబద్ధత లేకుండా గంటల తరబడి వ్యక్తిగత కాల్స్​ మాట్లాడేవారి తీరు విషయంలో కోపాన్ని నియంత్రించుకోవాలి. వారి తీరు మీ పనికి ఆటంకం కలిగిస్తోందా లేదా కేవలం చికాకు తెప్పిస్తోందా అనే విషయాన్ని బేరీజు వేసుకోండి. వారి అసమర్థత మీకు ఇబ్బందిగా మారితే, నిదానంగా ఉన్న విషయాన్ని చెప్పొచ్చు... లేదా మేనేజర్‌ దృష్టికి తీసుకువెళ్లొచ్చు. ఈ రెండింటిలో ఏది ఎంచుకున్నా సమస్యకు తక్షణ పరిష్కారమైతే లభించదు.

ఈసారి సమావేశంలో మెరుగైన పనితనం, వీడియోకాల్స్‌లో అప్రమత్తంగా లేకపోవడం వంటి విషయాలను చర్చకు తీసుకురండి. అంకితభావంతో చేస్తున్నామా లేదా జీతం కోసమే చేస్తున్నామా వంటి ప్రశ్నలు సంధించండి. మీరు ఎంత కష్టపడి పని చేస్తున్నప్పట్టికీ.. బృందంలో పనిచేస్తున్నారన్న సంగతి మరవొద్దు. వారితో సత్సంబంధాలూ అవసరమే. అందుకే ఫిర్యాదు గురించి మర్చిపోండి. ఎవరు ఎలా పనిచేస్తున్నారన్న విషయాన్ని సంస్థ కనిపెడుతూ ఉంటుంది. కాబట్టి మీ పనులపై మీరు దృష్టి పెట్టండి. మీ సహోదోగ్యుల పనితీరు గురించి మీ మేనేజర్‌కే వదిలేయండి.

ఇదీ చదవండి: సెల్‌టవర్‌ ఎక్కిన యువకుడిపై తేనెటీగల దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.