వైకాపా ఎమ్మెల్సీగా డొక్కా మాణిక్య వరప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తన రాజీనామాతోనే ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన స్థానాన్ని.. తిరిగి ఆయనే దక్కించుకున్నారు. రిటర్నింగ్ అధికారి నుంచి ఎమ్మెల్సీగా ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. ఆయనతో కలిపి.. శాసన మండలిలో వైకాపా సభ్యుల సంఖ్య 10కి చేరింది.
తెదేపా ఎమ్మెల్సీగా గతంలో ఉన్న ఆయన.. పార్టీ మారిన సందర్భంలో పదవికి రాజీనామా చేశారు. నాలుగు రోజుల క్రితం వైకాపా నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆ స్థానం కోసం మరెవరూ నామపత్రాలు వేయని కారణంగా.. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఇదీ చదవండి: