కరోనా నియంత్రించగలిగిన వైరస్ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతోపాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా లక్షణాలున్నట్లు ఎవరికైనా అనుమానం కలిగితే వెంటనే జిల్లా కంట్రోల్ రూమ్‌కి గానీ, 104కి గానీ ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. కరోనా అనుమానితులు ప్రజా రవాణాలో ప్రయాణించవద్దని విజ్ఞప్తి చేశారు. అంబులెన్స్ లేదా ప్రత్యేక వాహనంలో ఆస్పత్రి ఐసోలేషన్ వార్డుకి వారిని తరలిస్తామని తెలిపారు. నెల్లూరులో పాజిటివ్ కేసు నమోదయినందున రాష్ట్రవ్యాప్తంగా పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు జవహర్ రెడ్డి వివరించారు.
ఇవీ చదవండి: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రోబోలు సాయం