ETV Bharat / city

57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం

pensions స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు మంజూరు చేసింది. వీరితోపాటు పెండింగ్‌లో ఉన్న పింఛన్ల దరఖాస్తులను కూడా పరిష్కరించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, గ్రామీణాభివృద్ధి పీడీలకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆదేశాలు అందాయి.

pension
pension
author img

By

Published : Aug 16, 2022, 3:11 PM IST

New Pensions: స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు మంజూరు చేసింది. వీరితోపాటు పెండింగులో ఉన్న పింఛన్ల దరఖాస్తులను కూడా పరిష్కరించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, గ్రామీణాభివృద్ధి పీడీలకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆదేశాలు అందాయి. పింఛన్ల కోసం ఆన్‌లైన్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన ప్రభుత్వం.. దరఖాస్తుదారుల ఆధార్‌, ఓటరు కార్డులతో పాటు ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం ఆధారంగా అర్హులను ఎంపిక చేసింది. దీనికోసం తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించింది. దీని ఆధారంగా నకిలీ పింఛన్ల(డూప్లికేషన్ల)నూ తొలగించింది. అర్హులకు ప్రస్తుత ఆగస్టు నెలలో పింఛన్లు మంజూరు చేశామని, లబ్ధిదారులకు సెప్టెంబరు మొదటి వారంలో బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని గ్రామీణాభివృద్ధి శాఖ వర్గాలు వెల్లడించాయి.

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వం సోమవారం ప్రతి జిల్లాలో కొందరు లబ్ధిదారుల్ని ఎంపిక చేసి, వారికి ‘ఆసరా బహుమానాలు’ పంపిణీ చేసింది. పింఛను మంజూరు పత్రం, గుర్తింపు కార్డు, స్థానిక ఎమ్మెల్యే/మంత్రి రాసిన లేఖను జత చేసి అందించింది. ప్రస్తుతం ఒక్కో జిల్లాలో వంద మందికి పింఛన్లు పంపిణీ చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయి, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులతో పాటు 57 ఏళ్లు నిండిన లబ్ధిదారులు దాదాపు 10 లక్షల మంది ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వం తాజాగా ఆసరా పింఛన్లు మంజూరు చేసి ఆ వివరాలను జిల్లా గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టు అధికారులు, జిల్లా అధికారులకు పంపించింది.

నెరవేరుతున్న సీఎం హామీ: తెలంగాణలో 57 ఏళ్లు దాటిన వారికి వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేస్తామంటూ పేదలకు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ నెరవేరుతోందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 57 ఏళ్లు దాటిన లబ్ధిదారులకు మంత్రి ఈ సందర్భంగా పింఛను గుర్తింపు కార్డులను అందజేశారు.

నిరుపేదలకు సీఎం కేసీఆర్‌ అండ: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 36 లక్షల మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు అందజేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మరో 10 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేయడం ద్వారా సీఎం కేసీఆర్‌ మరోసారి నిరుపేదల ఆత్మబంధువు అని నిరూపించుకున్నారని తెలిపారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.