లాక్‌డౌన్ నేపథ్యంలో బియ్యం కార్డుదారులకు ప్రభుత్వం ప్రకటించిన వెయ్యి రూపాయలను ఇవాళ పంపిణీ చేయనున్నారు. ప్రతి వాలంటీర్ పరిధిలోని 50 కుటుంబాల వివరాలను ఇప్పటికే మ్యాపింగ్ చేశారు. వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి... వారి వద్ద ఉన్న ట్యాబ్‌లో జీపీఎస్ ఆన్ చేసి ఆ కుటుంబసభ్యుల్లో ఎవరో ఒకరిని ఇంటి ముందు నిల్చోబెట్టి ఫోటో తీస్తారు. లబ్ధిదారుల వివరాలతో పాటు ఇంటి పరిసర ప్రాంతమూ జియాట్యాగింగ్ ద్వారా నమోదు చేసిన తర్వాత సొమ్మును అందజేస్తారు. ప్రభుత్వసాయం పక్కదారి పట్టకుండా ఈ విధానాన్ని తీసుకొచ్చారు.సర్వర్ పనిచేయని చోట్ల ఆఫ్‌లైన్ ద్వారా పంపిణీ చేసేలా యాప్ ఉంది. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సెర్ప్ విడుదల చేసింది.
ఇదీ చదవండి: