ETV Bharat / city

రాష్ట్ర వ్యాప్తంగా సందడిగా పేదల ఇళ్ల పట్టాల పంపిణీ

రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నవరత్నాలను ఒక్కొక్కటిగా ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నారని.... దేశ చరిత్రలోనే 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చే కార్యక్రమం ఎక్కడా జరగలేదని స్పష్టంచేశారు.

distribution-of-housing-rails
distribution-of-housing-rails
author img

By

Published : Dec 26, 2020, 4:09 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం సందడిగా సాగింది. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గాజులకొల్లివలలో స్పీకర్ తమ్మినేని సీతారాం... పట్టాలు పంపిణీ చేశారు. ఇంటి నిర్మాణాలకు భూమి పూజ చేశారు. పాతపట్నంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి, పాత్రునివలసలో ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు... పేదలకు పట్టాలు అందజేశారు. విజయనగరం జిల్లా కురుపాంలో ఉప‌ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్... పట్టాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

విశాఖ జిల్లా ఆనందపురంలో 718 మందికి మంత్రి అవంతి శ్రీనివాసరావు పట్టాలు అందజేశారు. చోడవరంలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, కె.కోటపాడు మండలం కొరువాడలో ప్రభుత్వ విప్ ముత్యాలనాయుడు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. నర్సీపట్నం మండలంలో ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్, సబ్ కలెక్టర్ మౌర్య... పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా మొవ్వలో పేదలందరికీ ఇళ్ల పేరిట పామర్రు ఎమ్మెల్యే అనిల్ ఆధ్వర్యాన కార్యక్రమం జరిగింది. గుంటూరు జిల్లా బాపట్లలో ఉపసభాపతి కోన రఘుపతి, పేరేచర్లలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, చిలకలూరిపేటలో ఎమ్మెల్యే రజిని... నివేశన స్థలాల పంపిణీ చేపట్టారు. ఏటుకూరులో హోంశాఖ మంత్రి సుచరిత పాల్గొని... ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు.

అనంతపురం జిల్లా పెనుకొండలో మంత్రి శంకరనారాయణ, రాయదుర్గంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, గుంతకల్లులో ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ... మహిళలకు పట్టాలు ఇచ్చారు. కర్నూలు జిల్లా డోన్‌లో ఇళ్ల నిర్మాణాలకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శంకుస్థాపన చేయగా... ఆలూరులో మంత్రి జయరాం పట్టాల పంపిణీ చేశారు. ఆదోని, పాణ్యం, కోడుమూరు ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ జరిగింది. కడప ఉక్కాయపల్లిలో పేదలకు పట్టాలిచ్చిన ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా... "వైఎస్సార్‌ జగనన్న కాలనీ' ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో మంత్రి సురేశ్‌ ఇళ్ల పట్టాలు అందజేశారు. ఆ తర్వాత పైలాన్‌ ఆవిష్కరించారు. ఒంగోలులో టిడ్కో గృహాల ఒప్పంద పత్రాల పంపిణీలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. వెంకటగిరిలో ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి భూమి పూజ చేశారు. నెల్లూరులో పేదలకు మంత్రి అనిల్ కుమార్ పట్టాలిచ్చారు.

ఎమ్మెల్యేతో వాగ్వాదం

కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌ను... రుద్రవరం గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామంలో 350 ఎకరాల భూమి తీసుకుని స్థానికులకు పట్టాలు ఇవ్వకుండా అన్యాయం చేశారని నిలదీశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకి, గ్రామస్థులకు మధ్య వాగ్వాదం జరిగింది.

ఇదీ చదవండి

' వైఎస్‌ఆర్‌ జగనన్న ఇళ్లు కాదు.. వేల ఊళ్లు కడుతున్నాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.