ETV Bharat / city

Server Problems in Govt services: సర్వర్​తో సమస్యలు.. సాంకేతిక సమస్యలతో ప్రభుత్వ సేవలకు ఆటంకాలు! - ration problems in ap

రాష్ట్ర వ్యాప్తంగా సర్వర్‌ సమస్యలతో ప్రభుత్వ విభాగాల సేవలు ఎక్కడివక్కడే నిలిచిపోతున్నాయి. ఉచిత రేషన్‌ కోసం దుకాణాలకు వెళ్లే కార్డుదారులైతే... గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వస్తోంది. గత 2 రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది.

సర్వర్‌ కష్టాలు
సర్వర్‌ కష్టాలు
author img

By

Published : Jul 22, 2021, 6:51 AM IST

రాష్ట్ర వ్యాప్తంగా సర్వర్‌ సమస్యలతో ప్రభుత్వ సేవలు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. ఉచిత రేషన్‌ కోసం దుకాణాలకు వెళ్లే కార్డుదారులైతే... గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వస్తోంది. గత 2 రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. రిజిస్ట్రేషన్‌ శాఖలోనూ సేవలు స్తంభించాయి. ఆన్‌లైన్లో ఈసీ, ఇతర పత్రాలు తీసుకునేందుకూ వీల్లేకుండా పోయింది. వారం నుంచి ఇబ్బందులు పడుతున్నా.. ఈ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు.

హైదరాబాద్‌ కేంద్రంగా సర్వర్లు

రాష్ట్ర డేటా సేవలకు (ఎస్‌డీసీ) హైదరాబాద్‌ కేంద్రంగా ఉంది. ఆధార్‌, రేషన్‌ కార్డులు, స్టాంపులు రిజిస్ట్రేషన్లతో పాటు వివిధ విభాగాల సమాచారాన్ని అక్కడే పెద్ద ఎత్తున నిల్వ చేసేవారు. విభజన తర్వాత ఎస్‌డీసీలు వేరయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌డీసీ కూడా అక్కడ నుంచే పనిచేస్తోంది. ప్రభుత్వ శాఖలు అక్కడి సర్వర్ల నుంచే సమాచారాన్ని తీసుకుంటున్నాయి. రిజిస్ట్రేషన్ల శాఖను పరిశీలిస్తే.. దశాబ్దాలకు చెందిన సమాచారం 24 టెరాబైట్స్‌ వరకు ఉంటుంది. దీనంతటినీ భద్రంగా ఇక్కడకు చేర్చాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తేడా వస్తే మొత్తం సమాచారం గల్లంతవుతుంది. బ్యాకప్‌ చేసి జాగ్రత్తగా పెట్టుకోవాలి. నిర్వహణ నిమిత్తం రెండు రోజులు పాటు షట్‌డౌన్‌ చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ కారణంగా.. రాష్ట్రంలో సేవలు స్తంభిస్తాయనే ఆలోచనతో.. అధికారులు సమాచార తరలింపు ప్రక్రియ చేపట్టారు. ఇందులో భాగంగా జులై 9 నుంచి చర్యలు మొదలయ్యాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖతో పాటు పౌరసరఫరాలశాఖ తమ సమాచారాన్ని కాపీ చేసి.. మంగళగిరికి తరలించాయి. ప్రస్తుతం ఇక్కడ నుంచే సేవలు అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. సర్వర్లపై ఒత్తిడి పెరగడంతో సేవలు స్తంభిస్తున్నాయి.

చురుగ్గా సాగని ఉచిత రేషన్‌ పంపిణీ

గత రెండు రోజుల నుంచి ఉచిత రేషన్‌ పంపిణీ ముందుకు సాగడం లేదు. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద కిలో బియ్యం రూ.1 చొప్పున ఇచ్చే రేషన్‌ను.. జులై 1 నుంచి 9,260 మొబైల్‌ వాహనాల ద్వారా పంపిణీ చేశారు. ఆఫ్‌లైన్‌లోనూ పంపిణీ చేసే వీలు కల్పించారు. పెద్దగా సమస్య ఎదురు కాలేదు. జులై 20 నుంచి ప్రారంభమైన ఉచిత రేషన్‌ను డీలర్ల ద్వారా ఇస్తున్నారు. రాష్ట్రంలో 29 వేలకు పైగా రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. వాహనాల సంఖ్యతో పోలిస్తే ఇవి రెండు రెట్లు అధికం. మొబైల్‌ వాహనాల ద్వారా ఏకకాలంలో 9,260 మందికి వేలిముద్ర ద్వారా అందించేవారు.

ఇప్పుడు డీలర్ల ద్వారా ఏకకాలంలో 29వేల మందికి పైగా ఇవ్వాల్సి వస్తోంది. సర్వర్‌పై భారం పెరిగింది. గతంలో రోజుకు 200 మందికి పంపిణీ చేసే డీలర్లు.. ఇప్పుడు 50 మందికి కూడా ఇవ్వలేకపోతున్నారు. కార్డుదారుల నుంచి నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తోందని పలువురు డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ మాట్లాడుతూ... ‘ఆధార్‌-డేటాబేస్‌ అనుసంధాన ప్రక్రియలో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. సంబంధిత బృందం వీటిని పరిష్కరిస్తోంది. బుధవారం రాత్రికి ఇది పూర్తవుతుంది. గురువారం నుంచి ఇబ్బందులు ఉండవని’ అని పేర్కొన్నారు.

రిజిస్ట్రేషన్లలోనూ తొలగని ఇబ్బందులు

స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖకు సంబంధించి.. రాష్ట్రంలో 295 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. ఒక్కో చోట అయిదు వరకు కంప్యూటర్లు ఉంటాయి. వీటిని ఏకకాలంలో ఉదయం 11 మధ్యాహ్నం 3 గంటల వరకు వినియోగించడం వల్ల.. సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. అత్యవసరంగా రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకోవాలని దూరాభారంగా వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ‘ఉదయం నుంచి కొంతమేర సమస్య ఉన్నా.. మధ్యాహ్నం 3 గంటల తర్వాత చురుగ్గానే ఉంటున్నాయి.. 85% వరకు సమస్యలు పరిష్కారమయ్యాయి. మిగిలిన 15% స్థానికంగా పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నాం’ అని రిజిస్ట్రేషన్ల శాఖఅధికారులు పేర్కొంటున్నారు.

ఇదీ చదవండి:

మొబైల్​తో నిద్రలేమి.. ఆదమరిస్తే అంతే సంగతి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.