అంశమేదైనా సరే తనదైన శైలిలో స్పందించి తరచూ వార్తల్లో నిలుస్తుంటారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాజకీయ నాయకులు బాక్సింగ్ నేర్చుకోవాలంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు వర్మ గురువారం ఉదయం ట్విటర్ వేదికగా ఏపీ రాజకీయాలపై కామెంట్స్ చేశారు.
‘‘ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు చూస్తుంటే అతిత్వరలో అక్కడ నాయకులు బాక్సింగ్, కరాటే, కర్ర యుద్ధం నేర్చుకోవాల్సి ఉంది’’ -ఆర్జీవీ ట్వీట్
-
By the way things are going A P politicians will soon have to train in boxing , karate , stick fighting etc
— Ram Gopal Varma (@RGVzoomin) October 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">By the way things are going A P politicians will soon have to train in boxing , karate , stick fighting etc
— Ram Gopal Varma (@RGVzoomin) October 21, 2021By the way things are going A P politicians will soon have to train in boxing , karate , stick fighting etc
— Ram Gopal Varma (@RGVzoomin) October 21, 2021
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై అల్లరిమూకల దాడితో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కిన విషయం తెలిసిందే. కేంద్ర కార్యాలయంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడియత్నాలకు నిరసనగా బుధవారం తెదేపా బంద్ నిర్వహించింది. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. మరోవైపు పార్టీ శ్రేణులపై దాడులను నిరసిస్తూ గురువారం ఉదయం నుంచి 36 గంటలపాటు తెదేపా అధినేత చంద్రబాబు దీక్ష చేపట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్జీవీ ట్వీట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఇదీ చదవండి: