ETV Bharat / city

Digital Evaluation: జూనియర్‌ ఇంటర్‌లో డిజిటల్‌ మూల్యాంకనం - ఏపీ ఇంటర్ బోర్డు

Digital Evaluation: ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పారదర్శకతే లక్ష్యంగా డిజిటల్ మూల్యాంకనం ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ ఏడాది ఆర్ట్స్ గ్రుపుల్లో అమలుకు సన్నాహాలు చేస్తోంది.

జూనియర్‌ ఇంటర్‌లో డిజిటల్‌ మూల్యాంకనం
జూనియర్‌ ఇంటర్‌లో డిజిటల్‌ మూల్యాంకనం
author img

By

Published : Feb 16, 2022, 8:22 AM IST

Digital Evaluation: సత్వర ఫలితాలు.. పారదర్శకతే లక్ష్యంగా ఇంటర్‌ బోర్డు ఈ ఏడాది జూనియర్‌ ఇంటర్‌లో డిజిటల్‌ మూల్యాంకనం ప్రవేశపెడుతోంది. ప్రయోగాత్మకంగా దీన్ని ఆర్ట్స్‌ గ్రూపులకు అమలు చేయబోతోంది. గతేడాది సెప్టెంబరులో జరిగిన అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో వృత్తి విద్యా కోర్సుల (ఒకేషనల్‌) పేపర్ల మూల్యాంకనానికి ఈ విధానాన్ని అమలుచేశారు. అది సత్ఫలితాలనివ్వడంతో తాజాగా జనరల్‌ కోర్సుల్లో అమలు చేయడానికి సన్నద్ధమవుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగే పబ్లిక్‌ పరీక్షల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం హెచ్‌ఈసీ, సీఈసీల్లో గ్రూప్‌ సబ్జెక్టు పేపర్లను డిజిటల్‌ మూల్యాంకనం చేయడానికి బోర్డు అధికారులు కసరత్తు ప్రారంభించారు. జూనియర్‌, సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థులు కలిపి ఏటా 10 లక్షల మంది పరీక్షలు రాస్తున్నారు. వీరికి చెందిన సమాధాన పత్రాలు సుమారు 60లక్షలు ఉంటాయి. వాటిని మాన్యువల్‌గా దిద్ది ఆ తర్వాత మార్కులు కంప్యూటర్‌లో అప్‌లోడ్‌ చేసి ఫలితాలు వెల్లడించడానికి కనీసం నెలకు పైగా పడుతోంది. ఈ వ్యవధిని తగ్గించడంలో డిజిటల్‌ విధానం బాగా దోహదం చేస్తుందని, ఆపై బోర్డుకు ఖర్చుల రూపేణా ఆదా అవుతాయని దీనివైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మాన్యువల్‌గా అయితే స్పాట్‌ వాల్యుయేషన్‌ కేంద్రానికి అధ్యాపకులు విధిగా రావాలి. డిజిటల్‌లో అధ్యాపకుడు ఇంట్లో కూర్చొని మూల్యాంకనం చేసుకునే వెసులుబాటు ఉంది.

డిజిటల్‌ మూల్యాకంనం చేసేదిలా

తొలుత విద్యార్థుల సమాధాన పత్రాన్ని స్కాన్‌ చేస్తారు. ఆ తర్వాత అవి బోర్డుకు చెందిన డ్యాష్‌బోర్డులో అప్‌లోడ్‌ చేస్తారు. ఎగ్జామినర్‌ తనకు కేటాయించిన ఐడీ నంబరుతో కంప్యూటర్‌లో లాగిన్‌ కాగానే 24 పేపర్లతో కూడిన ఆన్సర్‌ స్క్రిప్టు ఒక పేజీ వెంట ఒకటి డిస్‌ప్లే అవుతుంది. స్కీమ్‌ ఆఫ్‌ వాల్యూయేషన్‌ ఆధారంగా మూల్యాంకనం చేసి మార్కులు వేస్తారు.

* ప్రతి విద్యార్థి రాసిన సమాధాన పత్రాన్ని ఇద్దరు అధ్యాపకులు మూల్యాంకనం చేస్తారు. వారిద్దరి మూల్యాంకనంలో మార్కుల వ్యత్యాసం పది శాతం లోపు ఉంటే మూడో అధ్యాపకుడితో మూల్యాంకనం చేయించరు. ఆ మార్కుల్లో ఎవరివి ఎక్కువ ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. మార్కుల వ్యత్యాసం 10 శాతం కన్నా ఎక్కువ ఉంటే తప్పనిసరిగా ఆ పేపర్‌ను మూడో ఎగ్జామినర్‌తో మూల్యాంకనం చేయిస్తారు.

* కంప్యూటర్లు లేని వారికి స్పాట్‌ కేంద్రంలో వాటిని సమకూర్చుతారు. ఒక్కో అధ్యాపకుడు మాన్యువల్‌లో అయితే రోజుకు 30 పేపర్లు మాత్రమే దిద్దుతారు. అదే డిజిటల్‌లో అయితే 45 వరకు దిద్దే అవకాశం ఉంది. దీనివల్ల మూల్యాంకనం చాలా వేగంగా పూర్తవుతుందని, ఆపై పారదర్శకంగా ఉండడంతో ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని బోర్డు వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి: polavaram:పోలవరానికి పాత ధరలే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.