దిశ చట్టం రాకపోయినా కావాల్సిన వ్యవస్థనంతా ఇప్పటికే ఏర్పాటు చేశామని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. తిరుపతిలో జరుగుతున్న స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ మూడో రోజు కార్యక్రమాల్లో భాగంగా... మహిళా భద్రతపై ప్రత్యేక సింపోజియంను నిర్వహించారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంతో ఏపీ పోలీస్ ఎంఓయూ కుదుర్చుకుంది. డీజీపీ గౌతం సవాంగ్, మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి జమున ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు.
మహిళా సాధికారిత కోసం కృషి చేస్తున్న పద్మావతి విశ్వవిద్యాలయం పోలీసులతో కలిసి పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నట్లు వీసీ జమున సంతోషం వ్యక్తం చేశారు. మహిళలకు ఎదురవుతున్న సమస్యలు ప్రపంచవ్యాప్తంగా సవాల్ విసురుతున్నాయని సవాంగ్ అన్నారు. గతంలో చట్టాల్లో చాలా లోపాలుండేవన్న ఆయన...దిశ చట్టం మహిళా భద్రతలో ఒక అంశం మాత్రమేనన్నారు. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ బలోపేతం చేసేలా దిశపోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశామన్న డీజీపీ.. మహిళా కేసుల్లో సత్వర న్యాయం కోసం ప్రత్యేక దిశ కోర్టులను ఏర్పాటు చేయాల్సిందన్న అవసరం ఉందన్నారు.
ఇదీ చదవండి: