ETV Bharat / city

'ఫోరెన్సిక్ నైపుణ్యాల్ని మెరుగుపరుచుకోవాలి' - ఏపీలో ఫోరెన్సిక్ ట్రైనింగ్

కేసు దర్యాప్తులో ఫోరెన్సిక్ విభాగం కీలకమని డీజీపీ గౌతమ్​ సవాంగ్ అన్నారు. ఫోరెన్సిక్ సైన్స్​ అసిస్టెంట్​ పోస్టులకు ఎంపికైన 51 మందికి శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం వర్చువల్​ విధానంలో మంగళగరి పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి ప్రారంభించారు.

ap dgp on forensic training program
ap dgp on forensic training program
author img

By

Published : Jun 10, 2021, 11:23 AM IST

ఫోరెన్సిక్​ సైన్స్​లో నైపుణ్యాల్ని మెరుగు పరచుకోవటం ద్వారా ఫోరెన్సిక్​ సైన్స్ అసిస్టెంట్లు నేర పరిశోధనలో కీలకం కాగలరని డీజీపీ గౌతమ్​ సవాంగ్ అన్నారు. నాణ్యమైన పోరెన్సిక్​ నివేదికల్ని తర్వితగతిన దర్యాప్తు అధికారులకు అందించగలిగితే నేరాల ఛేదన, నిరూపణకు ఎంతో దోహదపడుతుందన్నారు. కేసు దర్యాప్తులో ఫోరెన్సిక్ విభాగం కీలకంగా ఉంటుందని చెప్పారు.

ఫోరెన్సిక్ సైన్స్​ అసిస్టెంట్​ పోస్టులకు ఎంపికైన 51 మందికి శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం వర్చువల్​ విధానంలో మంగళగరి పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి డీజీపీ సవాంగ్ ప్రారంభించారు. రాష్ట్ర శిక్షణ సంస్థ డైరెక్టర్ యన్. సంజయ్, ఎపీ ఫోరెన్సిక్ సైన్స్ డైరెక్టర్ సరీన్ పర్యవేక్షణలో 6 నెలల పాటు శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. శిక్షల శాతాన్ని పెంచటంలో ఫోరెన్సిక్​ నిపుణత కీలకమైనదని మాజీ డీజీపీ కేశవ్​కుమార్ అన్నారు.

ఇదీ చదవండి:

వెంటిలేటర్‌పై ఉన్న గర్భిణికి సిజేరియన్‌.. ఏపీలో ఇదే ఫస్ట్ టైమ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.