ఏపీ పోలీసులకు జాతీయస్థాయిలో నాలుగు అవార్డులు దక్కాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. కృత్రిమ మేథస్సు, డిజిటల్ హెల్త్ ప్రొఫైల్, కొవిడ్ ట్రాకర్, యూనిఫైడ్ కమ్యూనికేషన్లకు టెక్ సభ అవార్డ్స్ లభించాయన్నారు. 2019 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 130 బహుమతులను ఏపీ పోలీస్ శాఖ కైవసం చేసుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
పాస్ పోర్ట్ జారీ విషయంలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానం దక్కించుకుందని డీజీపీ తెలిపారు. సేవ యాప్ ద్వారా 87 రకాల సర్వీసులను అందిస్తున్నామని డీజీపీ అన్నారు. దిశ యాప్ను 46 లక్షల మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నారని గౌతమ్ సవాంగ్ అన్నారు. మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. ఈ హంట్ ద్వారా నిందితుల డేటాను సులువుగా తెలుసుకునే వ్యవస్థను ఏర్పాటు చేశామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు.
ఇదీ చదవండి: