ETV Bharat / city

వేములవాడలో భక్తుల అవస్థలు.. పట్టించుకోని అధికారులు - వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి ఆలయం

తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. స్వామివారి దర్శనం కోసం దాదాపు రెండు గంటలకు పైగా క్యూలైన్లలో వేచి ఉన్నారు. చంటిబిడ్డతో దర్శనానికి వచ్చిన ఓ తండ్రి ఆవేదనను పట్టించుకోక పోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఓ రాజన్న.! ఏందీ ఈ అవస్థ మాకు అని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

BHAKTHULU
BHAKTHULU
author img

By

Published : Mar 11, 2021, 2:09 PM IST

తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. క్యూలైన్లలో భక్తులను పోలీసులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. అధికారుల కుటుంబాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా దర్శనాలు జరిగేందుకు సామాన్య ప్రజలను అవస్థలకు గురి చేస్తున్నారు.

దాదాపు రెండు గంటలకుపైగా భక్తులను క్యూలైన్లలోనే నిలబెట్టిన అధికారులు చోద్యం చూస్తున్నారు. చంటి పిల్లాడితో ఇబ్బంది పడుతున్న ఓ తండ్రి ప్రాధేయపడిన పోలీసులు వినలేదు. ఆలయంలో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యూలైన్లలోనే పోలీసులకు వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేశారు.

ఇదీ చూడండి: తెదేపా నేత కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.