Devotees crowd in Bhadrachalam : భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. క్రిస్మస్, వారాంతపు సెలవులు రావటంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. భక్తులు భారీగా స్వామివారి దర్శనానికి కదిలి రావడంతో క్యూలైన్లు నిండిపోయాయి.
ప్రధాన ఆలయంలోని లక్ష్మణసమేత సీతారాములకు ఆదివారం వేళ పంచామృతాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం, బంగారు పుష్పాలతో అర్చన చేశారు. బేడా మండపంలో జరిగే నిత్య కల్యాణ వేడుకలో భక్తుల సందడి నెలకొంది.
ఇదీ చూడండి:
Somireddy Fires On YCP Govt: సినీ రంగాన్ని నాశనం చేసే హక్కు ప్రభుత్వానికి లేదు: సోమిరెడ్డి