విజయవాడ గ్రామీణం గొల్లపూడిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజధాని మార్పు చేయొద్దంటూ రైతులు ధర్నాకు దిగారు. జాతీయ రహదారిపైకి మహిళలు, అన్నదాతలు వేలాదిగా తరలివచ్చారు. వారిని పోలీసులు అడ్డుకోవటంతో ఉద్రిక్తత నెలకొంది. గొల్లపూడి-1 సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద రైతులతో పాటు తెదేపా నేత దేవినేని ఉమ రోడ్డుపై బైఠాయించగా.. పోలీసులు అరెస్టు చేశారు. 29 గ్రామాల ప్రజలను రోడ్డున పడేసే విధంగా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తుందని దేవినేని మండిపడ్డారు.
ఇవీ చదవండి..