వేగంగా జరుగుతున్న పోలవరం పనులను నిలిపేసిన వైకాపా ప్రభుత్వం.. తిరిగి పనులు పరిగెత్తిస్తామని చెప్పటం హాస్యాస్పదమని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఆరు నెలలుగా పనులు ఆపేసి విలువైన ఓ సీజన్‌ని పోగట్టారని ఆయన విమర్శించారు. 2019లో అమర్చాల్సిన గేట్లను పెట్టకుండా ఆలస్యం చేశారన్నారు. స్వార్థప్రయోజనాలు, కక్షసాధింపుల కోసం పనులు రద్దుచేసి రివర్స్ టెండరింగ్ డ్రామాలాడారని ఆరోపించారు.
ఇష్టానుసారంగా పోలవరం ప్రాజెక్టుతో ఆటలాడుకునే హక్కు జగన్ ప్రభుత్వానికి లేదని స్పష్టంచేశారు. గేట్లు అమర్చే విషయంలో సాంకేతిక నిబంధనలు పాటించకుండా లక్షలాదిమంది జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. బాధ్యతతో చేయాల్సిన పనుల్ని పిల్లచేష్టల్లా చేస్తున్నారన్నారు. ఇప్పుడు పోలవరం పనుల్ని పరిగెత్తిస్తానని ముఖ్యమంత్రి చెప్పటం హాస్యాస్పదమని దేవినేని ఉమా ఎద్దేవాచేశారు.
ఇదీ చదవండి : నవంబరు నుంచి పోలవరానికి గేట్లు... సీఎం నిర్దేశం