రాష్ట్రంలో అక్రమ మద్యం, నాటుసారా ఏరులై పారుతుందని వైకాపా నేతలే చెప్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. శానిటైజర్లు తాగి రెండు రోజుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారన్నారు. 30 వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం కోసం జగన్ తెచ్చిన అధిక ధరల నాసిరకం మద్యం బ్రాండ్ల వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయని మండిపడ్డారు. వీటిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలని ఉమా డిమాండ్ చేశారు.
వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదులు, వాగుల నుంచి 70 లక్షల టన్నుల ఇసుక నిల్వచేశారని ఉమా అన్నారు. లక్షల టన్నుల ఇసుక మార్గమధ్యలో మాయమైపోయిందని వైకాపా నేతలే చెప్తున్నారని దుయ్యబట్టారు. ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘించి వందలాది ప్రొక్లైన్లతో వేలాది లారీలతో ఇసుక ఎలా తరలించారో జగన్ సమాధానం చెప్పాలని అన్నారు.
ఇదీ చదవండి: