ETV Bharat / city

'అరాచకాలు అడ్డుకున్నందుకు ఎస్​ఈసీ రాజీనామా చేయాలా..?'

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ను రాజీనామా చేయమనటానికి సజ్జల రామకృష్ణారెడ్డికి ఏ అధికారం ఉందని మాజీమంత్రి, తెదేపా నేత దేవినేని ఉమ ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో వైకాపా అరాచకాలను అడ్డుకున్నందుకు రాజీనామా చేయాలా..? అని నిలదీశారు. ఎస్​ఈసీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సజ్జలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

Devineni uma
దేవినేని ఉమ
author img

By

Published : Mar 19, 2020, 8:42 PM IST

దేవినేని ఉమ మీడియా సమావేశం

రాజ్యాంగబద్ధ వ్యవస్థలో ఉన్న రమేష్‌కుమార్‌ను రాజీనామా చేయమనటానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరని... మాజీమంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. బలవంతపు ఏకగ్రీవాలు అంగీకరించనందుకు రాజీనామా చేయాలా అని నిలదీశారు. రమేష్ కుమార్ కేంద్రానికి రాసిన లేఖ అవాస్తవమంటూ వైకాపా నేతలు 24 గంటలు పబ్బం గడుపుకుంటే... ఇప్పుడు కేంద్ర బలగాలు కళ్లముందు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం బాధ్యతారాహిత్యమని దేవినేని ఆరోపించారు. అధికార గర్వం, అహంకారంతో సజ్జల మాట్లాడారని మండిపడ్డారు. మంగళగిరి తెదేపా కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన... సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. స్థానిక ఎన్నికలకు ఇచ్చిన ప్రాధాన్యత కరోనాకి ఇవ్వకుండా ప్రభుత్వ పెద్దలు తొక్కిపెట్టారని విమర్శించారు. న్యాయస్థానాలంటే గౌరవం, బాధ్యత లేకుండా వైకాపా నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి : రమేశ్​కుమార్ వెంటనే రాజీనామా చేయాలి: సజ్జల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.