'ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించండి' - devineni uma on paddy payment
ధాన్యం రైతులకు బాకీ పడిన 2వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు చెల్లిస్తుందో చెప్పాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. పలుమార్లు దిల్లీకి వెళ్లిన సీఎం జగన్... ఈ అంశంపై ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా....కొనుగోళ్లు ఆపేశారని దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయిలను వెంటనే చెల్లించాలంటూ డిమాండ్ చేశారు.