రాష్ట్రంలో 12 జిల్లాలు డేంజర్ జోన్లలో ఉంటే.. ఏవిధంగా జగన్ ప్రభుత్వం మద్యం దుకాణాలకు అనుమతిచ్చిందంటూ.. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. జనాల గొంతు తడిపి, జేబు నింపుకొనే పథకాన్ని ప్రవేశపెట్టిందని మండిపడ్డారు. జే-ట్యాక్స్ కోసమే మద్యం షాపులు తెరిచారని ధ్వజమెత్తారు.
కరోనాపై తీసుకున్న చర్యలను అపహాస్యం చేసేలా, వైద్యుల త్యాగాన్ని అవమానించేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరు ఉందన్నారు. ఒక్క అవకాశం ఇవ్వాలని అడిగింది ఇందుకోసమేనా అని నిలదీశారు. మద్యం షాపుల వద్ద క్యూలైన్లను ఎలా సమర్ధించుకుంటారో జగన్, వైకాపా నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే మద్యం అమ్మకాలు నిలిపివేసి ప్రజా క్షేమాన్ని కాపాడాలని హితవు పలికారు.
ఇవీ చదవండి: