ETV Bharat / city

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం:అమరావతి వాతావరణ శాఖ - ఏపీలో ఉష్ణోగ్రతలపై వాతావరణ శాఖ సూచనలు

temperatures in ap: ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని అమరావతి వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం అమరావతి, విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం మొదలైన ప్రాంతాల్లో గరిష్ఠ స్థాయిలో38.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

temperatures in ap
ఏపీలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం
author img

By

Published : Mar 9, 2022, 2:33 PM IST

temperatures in ap: ఏపీలో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం పూర్తి పొడి వాతావరణం నెలకొందని అమరావతి వాతావరణ కేంద్రం చెబుతోంది. దీంతోపాటు రాగల 4-5 రోజుల్లో ఉష్ణోగ్రతల తీవ్రత మరింతగా పెరిగే అవకాశమున్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అమరావతి, విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 38.5 డిగ్రీలుగా నమోదు అవుతున్నాయి. మార్చి 15 తేదీనాటికి ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత 40 డిగ్రీలను మించి నమోదు అయ్యే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

temperatures in ap: పశ్చిమ ప్రాంతం నుంచి వచ్చే ఉష్ణగాలుల ప్రభావంతో కోస్తాంధ్రలో చాలా చోట్ల ఉష్ణోగ్రతల తీవ్రత గణనీయంగా పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ప్రత్యేకించి విజయవాడలో మార్చి 15 తేదీన 43 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. అటు అమరావతిలోనూ 42 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే సూచనలు ఉన్నాయి. విజయనగరం, కాకినాడ, ఏలూరు, గుంటూరు తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకూ నమోదు కావొచ్చని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.

ఇదీ చదవండి: Boats Rally: ప్రభుత్వంపై పడవల పోరు.. వరుసకట్టిన బోట్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.