Department of Agriculture Report 2021: తెలంగాణలో ప్రస్తుత యాసంగి(రబీ) సీజన్‌లో ఇప్పటివరకూ వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఈ సీజన్‌లో ఇప్పటికి సాధారణ విస్తీర్ణం 70,188 ఎకరాల్లో నాట్లు వేయాలి. కానీ, అందులో 18.77 శాతం(13,180 ఎకరాల్లో) మాత్రమే నాట్లు పడ్డాయని వ్యవసాయ శాఖ బుధవారం ప్రభుత్వానికిచ్చిన నివేదికలో పేర్కొంది.
గతేడాది ఇదే సమయానికి 37,333 ఎకరాల్లో నాట్లు వేశారు. వరి సాగు చేయవద్దని రైతులకు ప్రభుత్వం పలుమార్లు సూచించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న సాగు పెరుగుతుందని వ్యవసాయ శాఖ తొలుత అంచనా వేసినా.. అదీ పెద్దగా లేదు. మొక్కజొన్న ఇప్పటికి లక్షా 51 వేల ఎకరాల్లో సాగు కావాలి. అంతకన్నా 36 వేల ఎకరాలు తగ్గింది. వీటి తరవాత ప్రధాన పంటలైన శనగ, వేరుసెనగ సాగు స్వల్పంగా పెరిగాయి. అన్ని రకాల పంటలూ కలిపి ఇప్పటికి 8.81 లక్షల ఎకరాల్లో వేయాల్సి ఉండగా.. అంతకన్నా 12 వేల ఎకరాలు అదనంగా సాగైంది. గతేడాది ఈ సమయానికి 6.15 లక్షల ఎకరాలే సాగవగా.. ఈసారి 8.93 లక్షల ఎకరాలకు పెరిగింది.
ఇదీ చూడండి: Govt Employees on Fitment: ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత: సజ్జల