ETV Bharat / state

నేరుగా రాజమహేంద్రవరం TO ముంబయి - తొలిసారి 'ఎయిర్ బస్' సర్వీసులు ప్రారంభం

ఎయిర్‌బస్‌ విమాన సర్వీసులకు వాటర్‌ కెనాన్‌ సెల్యూట్‌తో ఘన స్వాగతం - ముంబయి టు రేణిగుంట మధ్య నూతన విమాన సర్వీసును ప్రారంభించిన ఇండిగో సంస్థ

Airbus Flights Operations Begin At Rajahmundry To Mumbai
Airbus Flights Operations Begin At Rajahmundry To Mumbai (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 3 hours ago

Airbus Flights Operations Begin At Rajahmundry To Mumbai : రాజమహేంద్రవరం నుంచి ప్రధాన నగరాలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. తాజాగా రాజమండ్రి -ముంబయి ఎయిర్‌బస్‌ విమాన సర్వీసు ఆదివారం ప్రారంభమైంది. రాజమహేంద్రవరం నుంచి 114 మంది ప్రయాణికులతో రాత్రి ఆదివారం రాత్రి 9 గంటలకు విమానం టేకాఫ్‌ అయింది. అలాగే ముంబయి నుంచి 173 మంది ప్రయాణికులతో వచ్చిన మరో విమానానికి ఎయిర్ పోర్టు సిబ్బంది రన్‌వేపై వాటర్‌ కెనాన్‌ సెల్యూట్‌తో స్వాగతం పలికారు.

ప్రయాణికులకు స్వాగతం : రాజమహేంద్రవరం విమానాశ్రయానికి ఎయిర్‌బస్‌ రావడం ఇదే మొదటిసారి. రాజమండ్రి నుంచి ఎయిర్‌బస్‌ విమాన సర్వీసులు ప్రారంభం సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎం.వెంకటేశ్వరరావు, ఆదిరెడ్డి శ్రీనివాసు, బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. అలాగే రుడా ఛైర్మన్‌ బొడ్డు వెంకటరమణ చౌదరి, తదితర ముఖ్య అతిథులతో పాటు ఏపీడీ జ్ఞానేశ్వరరావు విమానశ్రయంలోని టెర్మినల్‌ భవనం వద్ద నిల్చొని ప్రయాణికులకు స్వాగతం పలికారు. అంతకుముందు వీరంతా జ్యోతి ప్రజ్వలన చేశారు.

కడప వాసులకు గుడ్ న్యూస్- హైదరాబాద్‌కు విమాన సర్వీసుల పునరుద్ధరణ

ముంబయి - రేణిగుంట : అలాగే ముంబయి నుంచి రేణిగుంట మధ్య ఇండిగో విమాన సంస్థ నూతన సర్వీసును ప్రారంభించింది. ఈ విషయాన్ని విమానాశ్రయ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ మన్నే తెలిపారు. ఈ విమానం రోజూ ఉదయం 5.30 గంటలకు ముంబయిలో బయలుదేరి అదేరోజు ఉదయం 7.15 గంటలకు తిరుపతి జిల్లా రేణిగుంటకు చేరుకుంటుంది. మళ్లీ తిరిగి ఉదయం 7.45 గంటలకు బయలుదేరి అదేరోజు ఉదయం 9.25 గంటలకు ముంబయికి చేరుకుంటుంది. మొత్తం 186 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ ఇండిగో విమానం నిన్న(ఆదివారం) ఉదయం 183 మంది ప్రయాణికులతో రేణిగుంటకు చేరుకుని అక్కడి నుంచి 186 మందితో తిరిగి వెళ్లింది. అయితే ముంబయి-రేణిగుంట మధ్య నేరుగా విమాన సర్వీసును ప్రారంభించాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడిని స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డిని ఇటీవలే కోరారు.

ప్రీమియం ఎకానమీ సీట్లతో Air India కొత్త విమానం - త్వరలోనే A320neo సర్వీస్ ప్రారంభం!

'ఏపీ నుంచి వియత్నాంకు నేరుగా విమాన సర్వీసులు' - AP and Vietnam Tourism Conclave

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.