తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌కి చెందిన ఇద్దరు మిత్రులు కలిసి నిత్యావసర సరకుల కోసం స్థానిక డీ మార్ట్ స్టోర్‌కి వెళ్లారు. రూ. 2500 వరకు సరుకులు కొనుగోలు చేశారు. గోధుమపిండి తీసుకునే క్రమంలో తూకంలో మోసాన్ని గుర్తించి యాజమాన్యాన్ని ప్రశ్నించారు. దానికి వారు ఇప్పుడే అలా వస్తుందని చెప్పి ఆ తూకాన్ని మూసేశారు.
ఈ విషయంపై ప్రశ్నించినందుకు స్టోర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించడంతో వారిద్దిరనీ స్టేషన్‌కి తీసుకెళ్లారు. మళ్లీ ఇలా చేయొద్దంటూ హెచ్చరించి పంపించారు.
తూకం విషయంలో ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్‌కి వెళ్లాల్సిందే అని అక్కడ కొనుగోలుదారులు చర్చించుకుంటున్నారు.
ఇదీ చదవండి: బిహార్ బరి: వామపక్షాలు అస్థిత్వం కాపాడుకునేనా?